Abhishek Sharma : ఆసియా కప్ 2025 లో తన అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టును ఫైనల్ చేర్చిన యువ సంచలనం అభిషేక్ శర్మ, ఇప్పుడు కేవలం క్రికెట్ మైదానంలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా సంచలనం సృష్టిస్తున్నాడు. ఐసీసీ T20I ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన అభిషేక్, తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ లైలా ఫైసల్ తో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. ఎవరీ లైలా ఫైసల్? ఆమె నేపథ్యం ఏంటి? వారిద్దరి రిలేషన్‌షిప్ స్టేటస్ ఏమిటి? పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
ఆసియా కప్ 2025 లో తన విధ్వంసకరమైన ఆటతో అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా సూపర్ 4 దశలో పాకిస్తాన్‌పై అతని అద్భుత ప్రదర్శన, ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై కూడా మెరుపులు మెరిపించడం.. అతన్ని సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిపింది. ఈ టోర్నమెంట్‌లో అసాధారణ ప్రదర్శనల కారణంగా, ఐసీసీ T20I ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ కెరీర్ బెస్ట్ రేటింగ్ అయిన 907 సాధించి, ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ 1 T20 బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.
పాకిస్తాన్‌పై 39 బంతుల్లో 74 పరుగులు చేసి, భారత్‌కు కీలక విజయాన్ని అందించాడు. పవర్‌ప్లేలో అతను 216.39 స్ట్రైక్ రేట్‌తో 132 పరుగులు సాధించి, T20 క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
Abhishek Sharma 🕉 is probably planning to make it official with his Kashmiri gf Laila Faisal ☪️
They’re getting papped together frequently nowadays pic.twitter.com/7fguHaFbyl
— Raj (@Worryna_) June 11, 2025
ఎవరీ లైలా ఫైసల్?
అభిషేక్ శర్మ క్రికెట్ విజయాలు ఒకవైపు కొనసాగుతుండగా, అభిమానులు అతని వ్యక్తిగత జీవితం గురించి కూడా తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా అతని గర్ల్‌ఫ్రెండ్ లైలా ఫైసల్ గురించి చాలా చర్చ జరుగుతోంది. లైలా ఫైసల్ పేరు IPL 2025 నుండి అభిషేక్ శర్మతో ముడిపడి ఉంది. ఆమె ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఒక ప్రముఖ కాశ్మీరీ ముస్లిం కుటుంబానికి చెందినది.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కే పురంలో తన పాఠశాల విద్యను పూర్తి చేసిన లైలా, ఆ తర్వాత లండన్‌లోని కింగ్స్ కాలేజీలో సైకాలజీ చదివింది. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్ లండన్‌లో ఫ్యాషన్ డిజైన్, మార్కెటింగ్ , స్టైలింగ్ లో ఉన్నత విద్యను అభ్యసించింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, లైలా మొదట తన తండ్రి కంపెనీకి సీఓఓగా పనిచేసింది. 2022లో తన తల్లితో కలిసి లైలా రూహి ఫైసల్ డిజైన్స్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థను ఆమె నిర్వహిస్తోంది.
అభిషేక్ శర్మ , లైలా ఫైసల్ లు 2025 లో అనేకసార్లు కలిసి కనిపించారు. 2025 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల సమయంలో అభిషేక్, లైలా ఫైసల్ చాలాసార్లు కలిసి కనిపించారు. ఇంగ్లాండ్‌పై అభిషేక్ చేసిన 135 పరుగుల ఇన్నింగ్స్‌కు లైలా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని చర్చ మొదలైంది. వీరిద్దరి ఫోటోలు తరచుగా వైరల్ అవుతున్నప్పటికీ, ఈ జంట మాత్రం తమ సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఏదేమైనా, అభిషేక్ శర్మ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ టీ20 బ్యాటర్‌గా నిలవడంతో పాటు, తన వ్యక్తిగత జీవితంలోనూ ఆసక్తికరమైన అంశాలతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..