టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వృత్తిపట్ల కట్టుబాటును మరోసారి చాటుకున్నాడు. తాజాగా ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. వైద్యులు విశ్రాంతి తీసుకోమని సూచించినప్పటికీ, నిర్మాతకు ఆర్థిక నష్టం వాటిల్లకుండా ఉండేందుకు, నొప్పి ఉన్నప్పటికీ, మరుసటి రోజు షూటింగ్ ను పూర్తి చేశాడు. ఆయన ఈ నిర్ణయం చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఎన్టీఆర్ గాయాల నుండి కోలుకుంటున్నాడు. తన తదుపరి చిత్రం ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు.
మరిన్నివీడియోల కోసం :