బెంగుళూరు నగరంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వివాదం సమాజంలో చర్చనీయాంశంగా మారింది. చిక్మంగళూరుకు చెందిన ప్రవీణ్ , చందన అనే జంట మే 5వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ బెంగుళూరులోని సప్తగిరి ప్యాలెస్‌లో కాపురం పెట్టారు. వివాహం తర్వాత తొలి రాత్రి ప్రవీణ్ శారీరక సంబంధానికి నిరాకరించడంతో వారి మధ్య వివాదం మొదలైంది. ఈ విషయంపై చందన వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరింది. వైద్య పరీక్షలలో ప్రవీణ్ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. అయితే, మానసిక ఒత్తిడి కారణంగా కొంత సమయం ఇవ్వాలని వైద్యులు సూచించారు. మూడు నెలల తర్వాత, చందన తన భర్త ప్రవీణ్‌ను ఒత్తిడి చేసి రూ. 2 కోట్లు పరిహారంగా డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌కు ఆమె కుటుంబ సభ్యులు కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్నివీడియోల కోసం :