సినిమా ఇండస్ట్రీలో అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ హీరోలను కూడా అభిమానులుగా చేసుకున్న ఘనత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కే చెందుతుంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది హీరోలు, నటులు పవన్ కల్యాణ్ ను అమితంగా అభిమానిస్తారు. అలాంటిది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓజీ మేనియా నడుస్తోంది. ప్రేక్షకులు కూడా స్టార్ హీరోలు కూడా పవన్ సినిమాను ఫస్ట్ రోజే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, టాలీవుడ్ హీరో అశోక్ గల్లా కూడా ఎలాగైనా ఓజీ సినిమా ఫస్ట్ షో చూడాలనుకున్నాడు. అయితే సినిమా రిలీజ్ రోజు తన సినిమా షూట్ ఉంది. అందుకే ఆ షూట్ ను క్యాన్సిల్ చేయమని డైరెక్టర్ ను ఎలా బతిమాలాడుతున్నాడో ఒక వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఓజీ రిలీజ్ రోజు కూడా డైరెక్టర్ షూటింగ్ ఉంది అనడంతో చిత్ర బృందం మొత్తం ఓజీకి వెళ్లాలని, షూటింగ్ క్యాన్సిల్ చేయించడానికి నానా కష్టాలు పడ్డారు. అశోక్ నేను హీరోని.. నేను చెప్తే షూటింగ్ ఆగుతుంది అనిధీమాగా వెళ్లినా పని కాలేదు. దీంతో ఆ తరువాత చాలామంది డైరెక్టర్ ను కన్విన్స్ చేయాలనీ ట్రై చేసి ఓడిపోయారు. మరి చివరకు షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందా లేదా అనేది వీడియోలో చెప్పలేదు. ఇక ఈ వీడియో క్యాప్షన్ లో ఎవరైనా డైరెక్టర్ ను కన్విన్స్ చేసే సలహాలు ఇవ్వమని కోరాడు హీరో అశోక్ గల్లా.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన పవన్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ‘స్టార్ హీరో మేనల్లుడైనా పవన్ కల్యాణ్ కు వీరాభిమానే’ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అశోక్ గల్లా ప్రస్తుతం వింటారా సరదాగా అనే సినిమాలో నటిస్తున్నాడు. నటుడు, డైరెక్టర్ అయిన ఉద్భవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నాగవంశీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి
హీరో అశోక్ గల్లా షేర్ చేసిన వీడియో ఇదే..
Scenes from the sets – Director sir ni convince cheyyadam ongoing… any more excuse suggestions are welcome. 🥋🔥🗡️#OGDay #OG pic.twitter.com/Ibzg6YvcIh
— Ashok Galla (@AshokGalla_) September 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.