
ఓజీ థియేటర్స్ దగ్గర జనాల హంగామా.. హడావిడి చూస్తుంటే.. అప్పుడెప్పుడో కరోనా ఫస్ట్ వేవ్ ముందు.. ఓటీటీలు ఇంకా రాని టైంలో.. థియేటర్లు ఎలా ఉండేవో గుర్తుకువస్తోంది. ఇక్కడ, కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి మరీ.. పవన్‌ను చూపించడమే కాదు.. తన టీజర్ కట్స్‌తో సినిమాపై క్రేజ్‌ను మెయిన్టేన్ చేస్తూ.. థియేటర్ల దగ్గర అప్పటి పరిస్థితుల్ని కూడా మరో సారి గుర్తుకు చేశాడు డైరెక్టర్ సుజీత్. పవన్ డై హార్డ్ ఫ్యాన్‌గా.. పవన్‌ను ఎలా చూపిస్తే.. అందరికీ గూస్ బంప్స్ వస్తాయో.. ఎగ్జాక్ట్లీ అలాగే తన హీరోను చూపించాడు. లుక్ మాత్రమే కాదు.. సినిమాల్లోని కొన్ని సీన్లలో పవన్ పాత సినిమాల రిఫరెన్స్‌లు తీసుకుని ఫ్యాన్స్‌ను అప్పటి జమానాకు తీసుకెళ్లి మరీ అరిపించాడు సుజీత్. ఇక సినిమా మొదలవ్వగానే సిల్వర్ స్క్రీన్ పై వచ్చే టైటిల్ కార్డ్ ఫ్యాన్స్‌కు ఆల్మోస్ట్ హై డోపమైన్ ఫీల్ నిస్తుంది. పవన్ ఇంట్రో కూడా ది బెస్ట్ అనేలాగే ఉంటుంది. తమన్ బీజీఎమ్స్… సుజీత్ ఎలివేషన్స్.. పవన్ స్క్రీన్ ప్రజెన్స్.. కట్ చేస్తే.. మరణ మాస్ అంతే! ఈ సారి తన మ్యూజిక్‌తో నందమూరి తమన్ కాస్తా.. కొణిదల తమన్‌గా మారిపోయాడు. సినిమా హాలును వణికిస్తాడు.