తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పెద్దశేష వాహనసేవలో పాల్గొన్నారు శ్రీవారు. భూదేవి-శ్రీదేవి సమేత మలయప్పస్వామిగా.. పెదశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో శ్రీవారు ఊరేగారు. బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చిన భక్తులు.. శ్రీవారిని కనులారా చూసి తరించారు. మరోవైపు.. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సీఎం చంద్రబాబు దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా.. 14 సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆలయాల్లో అన్నదానానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఇవి కూడా చదవండి
ఇక.. వచ్చే నెల 2వ తేదీ వరకు తిరుమల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై.. తొమ్మిదో రోజు చేపట్టే ధ్వజావరోహణంతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 9రోజులపాటు శ్రీవారు.. ఉదయం, సాయంత్రం సమయాల్లో వేర్వేరు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్రమంలోనే… తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిగా శ్రీవారు పెదశేషవాహనంపై ఊరేగారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.