Fact Check: ఎబోలా సోకుతోంది.. కూల్‌డ్రింక్స్‌ తాగకండి..! ఇది నిజమా? అబద్ధమా?

Fact Check: ఎబోలా సోకుతోంది.. కూల్‌డ్రింక్స్‌ తాగకండి..! ఇది నిజమా? అబద్ధమా?


ఎబోలా వైరస్‌ సోకుతోందని, ప్రజలంతా కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు వాట్సాప్‌లో ఒక విషయం వైరల్‌ అవుతోంది. “దయచేసి మాజా, కోకో కోలా, 7అప్, థమ్సప్, పెప్సీ, స్ప్రైట్ వంటి శీతల పానీయాలను తాగవద్దు. ఎందుకంటే కంపెనీ కార్మికుల్లో ఒకరు ఎబోలా అనే ప్రమాదకరమైన వైరస్ కలుషిత రక్తాన్ని అందులో కలిపారు” అని సోషల్‌ మీడియాలో, అలాగే వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ చక్కర్లు కొడుతోంది. అయితే ఫ్యాక్ట్‌ చెక్‌లో ఈ వార్త ఫేక్‌ అని తేలింది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్‌లో వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ప్రభుత్వ సలహా నకిలీదని తేలింది. భారత ప్రభుత్వ పరిధిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అటువంటి సలహా జారీ చేయలేదని PIB మరింత స్పష్టం చేసింది. వైరల్ అయిన వాట్సాప్ సందేశాన్ని నకిలీదని కొట్టిపారేసింది.

దేశవ్యాప్తంగా ప్రజలు శీతల పానీయాలను నివారించాలని కేంద్ర ప్రభుత్వం ఒక సలహా జారీ చేసిందనే వాదన పూర్తిగా నకిలీది. వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్న ఇటువంటి పుకార్లు, ఆరోపణలను నమ్మవద్దని పౌరులను అభ్యర్థించారు. కాగా ఏదైనా ఒక వైరల్ పోస్ట్ నిజమైనదా లేదా నకిలీదా అని తెలుసుకోవడానికి ప్రజలు తమ సందేహాలను PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌కు 87997 11259 నంబర్‌కు వాట్సాప్‌లో పంపవచ్చు. లేదా factcheck@pib.gov.in కు ఇమెయిల్ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నోడల్ ఏజెన్సీ అయిన PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని గుర్తిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *