ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే ఆదరణే వేరు. ఈ జానర్లకు చెందిన సినిమాలు ఇతర భాషల్లో ఉన్నా సబ్ టైటిల్స్ తో చూసి ఆనందిస్తుంటారు ఓటీటీ ఆడియెన్స్. అలా రీసెంట్ గా ఓటీటీలోకి వణుకుపుట్టించే ఓ హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చేసింది. కొన్న రోజుల క్రితమే థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక పేరు మోసిన రాజకీయ నాయకుడు అక్రమంగా సంపాదించిన డబ్బును ఎవరికీ తెలియకుండా ఓ పాడు బడ్డ బంగ్లాలో దాచి ఉంచుతాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఈ రహస్యాన్ని అతనే బయట పెడతాడు. దీంతో చాలా మంది కన్ను ఆ డబ్బు మీద పడుతుంది. అయితే ఆ పాడు బడ్డ బంగ్లాలో దయ్యాలు, ప్రేతాత్మలు ఉన్నాయని అందరూ భయపడుతుంటారు. దీంతో డబ్బు మీద కోరిక కలిగినా ప్రాణం మీద ఆశతో వెనుకంజ వేస్తారు. ఇదే సమయంలో
హీరో తాను రాసిన కథను సినిమాగా తీయాలని నిర్మాతల చుట్టూ తిరుగుతాడు. కానీ ఎక్కడా అతనికి అవకాశం రాదు. దీంతో తనే ప్రొడ్యూసర్ గా మారాలనుకుంటాడు. అప్పుడే రాజకీయ నాయకుడి డబ్బు ఉన్న బంగ్లా గురించి తెలుస్తుంది. దీంతో తన స్నేహితులతో కలిసి పాడు బడ్డ బంగ్లాకు వెళతాడు. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది.
రాజకీయ నాయకుడి డబ్బు ఉన్న బంగ్లాలోకి వెళ్లిన హీరోకు, అతని గ్యాంగ్ కు విపత్కర పరిస్థితులు ఎదరవుతాయి. చాలా మంది అనుకున్నట్లే ఆ బంగ్లాలో దుష్టశక్తులు, ప్రేతాత్మలు హీరో గ్యాంగ్ ను ఇబ్బందుల్లో పడేస్తాయి. మరోవైపు హీరో భార్యకు కొన్ని పీడ కలలు వస్తుంటాయి? ఒక చిన్న పాప తనను భయపెడుతుంటుంది. మరి ఆ ప్రేతాత్మల నుంచి హీరో అండ్ గ్యాంగ్ బయట పడ్డారా? డబ్బులు తీసుకున్నారా? చివరకు ఏమైందన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి
ట్విస్టులతో వణికించే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు జెన్మ నచ్చతిరం.. అంటే తెలుగులో జన్మ నక్షత్రం. బి మణివర్మన్ తెరకెక్కించిన ఈ సినిమాలో టాలీవుడ్ హీరోయిన మాల్వీ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించింది. ప్రస్తుతం. టెంట్‌కొట్టా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం తమిళంలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఈ జెన్మ నచ్చతిరం మూవీని ఎంజాయ్ చేసేయవచ్చు
రెండు ఓటీటీల్లోనూ చూడొచ్చు..
😎 Big scares, small price!
📺 Stream in crystal-clear 4K.
🩸 Secrets, screams & spine-chills… all pocket-friendly thrills await! #JenmaNatchathiram streaming NOW on #Tentkotta! 🎬🔥 #JenmaNatchathiramonTentkotta #India #Streaming #Movies #TentkottaOTT pic.twitter.com/XprfE6JVoY— Tentkotta (@Tentkotta) September 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.