రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాజీపేట నుంచి చర్లపల్లి మీదుగా పట్నాకు ప్రత్యేక రైళ్లను నడిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన కూడా విడుదల చేసింది. రైల్వే అధికారుల ప్రకటన ప్రకారం.. అక్టోబర్ నుంచి జనవరి 2వ మధ్యన ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది.
ప్రత్యేక రైళ్ల వివవరాలు
పట్నా- చర్లపల్లి మధ్య నడిచే 03253 నంబర్ గల రైలు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండనుందని రైల్వే శాఖ తెలిపింది.
చర్లపల్లి-పట్నా మధ్య నడిచే 07255 నంబర్ గల రైలు అక్టోబర్ 3వ తేదీ నుంచి జనవరి 2 తేదీ వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.
చర్లపల్లి-పట్నా మధ్య నడిచే 07256 నెబర్ గల మరో రైలు అక్టోబర్ 3 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు ప్రతి శుక్రవారం రాకపోకలు సాగించనుంది.
ఈ ప్రత్యేక రైళ్లు ఎక్కడెక్కడ ఆగుతాయ
ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, గోందియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, ఝార్సుగూడ, రూర్కెలా, హతియా, రాంచి, బొకారో స్టీల్ సిటీ, గోమోహ్, కొడెర్మా, గయా, జెహనాబాద్ స్టేషన్లలో రైళ్లు ఆగుతాయని రైల్వేశాఖ అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి