తెలంగాణలో, వేలాది మంది కార్మికులు, చిన్న వ్యాపారులు రోజువారీ వేతనాలకు మించి అవకాశాలను కోరుకుంటున్నారు. వారికి, టాటా ఏస్ ప్రో వంటి వాహనం యాజమాన్యపు హక్కు.. అంటే గుర్తింపు, గౌరవం.. ఆదాయ స్కేలబిలిటీ కోసం టాటామోటర్స్ అబ్ మేరీ బారీ ప్రచారం.. అంటే ఇప్పుడు నా వంతు అంటూ ట్రక్ డ్రైవర్లలో ఆర్థిక చైతన్యం కలిగిస్తోంది.. అంతేకాకుండా టాటామోటర్స్, TV9 నెట్‌వర్క్ సంయుక్తంగా రోడ్ సేఫ్టీ, బాధ్యతపై అవగాహన కలిగిస్తోంది.. ఈ అవగాహన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా.. అభినందించారు. టాటా మోటర్స్, టీవీ9 నెట్‌వర్క్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ రోడ్డు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించడంతోపాటు.. ప్రతిఒక్కరూ దీనిపై అవగాహనతో ఉండాలన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని.. రోడ్డు ప్రమాదాలను నివారణకు కృషి చేయాలని, కుటుంబాలను ప్రమాదంలో పడేసేలా చేయొద్దని పొన్నం ప్రభాకర్ కోరారు.
రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు.. జాయింట్ కమిషనర్ సి. రమేష్ టాటా మోటార్స్ CV & TV9 నెట్‌వర్క్ ద్వారా ఏస్ ప్రో – అబ్ మేరీ బారీ ప్రచారం.. తెలంగాణ ఆర్థిక చేయూత, వ్యవస్థాపకత కోసం చేస్తున్న ప్రయత్నాలతో ఎలా సరిపోతుందో పంచుకున్నారు. ప్రతి చిన్న కార్మికుడు భారతదేశ ఆత్మనిర్భరత ప్రయాణానికి దోహదపడే భవిష్యత్తు కోసం ఆకాంక్షించారు.