Bigg Boss Telugu 9: బుర్రబద్దలయ్యే ట్విస్ట్.. ఈ వారమే హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్స్.. ఎవరో తెలుసా?

Bigg Boss Telugu 9: బుర్రబద్దలయ్యే ట్విస్ట్.. ఈ వారమే హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్స్.. ఎవరో తెలుసా?


Bigg Boss Telugu 9: బుర్రబద్దలయ్యే ట్విస్ట్.. ఈ వారమే హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్స్.. ఎవరో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ ఇస్తోన్న ఇంట్రెస్టింగ్ గేమ్స్, టాస్కులు, కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్, అలకలు, గొడవలన్నీ కలిసి ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్ అందిస్తున్నాయి. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. ఇప్పటికే హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 13 మంది కంటెస్టెంట్స్ తోనే హౌస్ రన్ అవుతోంది. అయితే త్వరలోనే వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నాయనే చర్చ జోరుగా నడుస్తోంది. అయితే అంతలోనే బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే నెవర్ బిఫోర్ అనేలా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ వారంలోనే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయట. అది కూడా అగ్నిపరీక్షలో ఆఖరి దాకా సత్తా చాటి బిగ్ బాస్ కు ఎంపిక కాని కంటెస్టెంట్స్ ఇప్పుడు హౌస్ లోకి రానున్నారని తెలుస్తోంది. వారెవ్వరంటే నాగ ప్రశాంత్, దివ్యా నికిత, అనుషా రత్నం, షాకీబ్.. ఈ నలుగురు ఈ వీకెండ్ ఎపిసోడ్స్ లోనే హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది.

ఈ నలుగురిలో ముఖ్యంగా నాగ ప్రశాంత్ బాగా ఫేమస్ అయ్యాడు. జడ్జిలు బిందు మాధవి, నవదీప్, అభిజీత్ సైతం ఇతనిని పొగడ్తలతో ముంచెత్తారు. అలా ఎంటర్టైన్ చేస్తూనే టాస్కులలో సత్తా చాటిన నాగ ప్రశాంత్ కు బిగ్ బాస్ హౌస్ లోకి అవకాశం దొరకకపోవడం అన్యాయమని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో అతనితో సహా మొత్తం నలుగురికి సెకెండ్ ఛాన్స్ ఇస్తున్నారని సమాచారం. అయితే అగ్నిపరీక్షలో సత్తా చాటిన ఈ నలుగురికి అంత ఈజీగా హౌస్ లో ఉండే ఛాన్స్ దొరకదు. ఎందుకంటే ఈ నలుగురూ టాస్క్ లలో పాల్గొని మళ్లీ తమ సత్తా నిరూపించుకోవాల్సి ఉంటుంది. చివరకు వీరిలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉంటారని, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. బిగ్ బాస్ విశ్లేషకుడు, మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి కూడా ఇదే విషయంపై ఒక వీడియోను రిలీజ్ చేశాడు? మరి బిగ్ బాస్ ఇచ్చిన సెకెండ్ ఛాన్స్ ను ఎవరు వినియోగించుకుంటారు? అసలు ఈ వార్తల్లో నిజమెంత? అబద్ధమెంత? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

ఆది రెడ్డి వీడియో..

 

View this post on Instagram

 

A post shared by Adi Reddy (@adireddyofficial)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *