17 ఏళ్ల వయసులో షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు సుజిత్. అనంతపురం కు చెందిన ఈ అబ్బాయి 30కు పైగా లఘు చిత్రాలు తీసి తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత 2014లో రన్ రాజా రన్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే టేకింగ్ పరంగా అందరి మన్ననలు అందుకున్నాడు. ఇక రెండో సినిమా సాహో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ను సుజిత్ హ్యాండిల్ చేసిన తీరు అందరినీ మెప్పించింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తెరకెక్కించిన ఓజీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్ని రోజులుగా ఓజీ మూవీతో పాటు డైరెక్టర్ పేరు తెగ ట్రెండ్ అవుతోంది. మాఫియా, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన ఓజీ సినిమాలో సుజిత్ పవన్‌ను ఎంతో స్టైలిష్‌గా చూపించాడని ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్స్ , ట్రైలర్ చెబుతోంది. ఈ కారణంగానే ఓజీ సినిమాపై అంచనాలు ఆకాశానంటుతున్నాయి. పవన్ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా? అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు అమితంగా నచ్చేసిన సుజిత్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం రండి.
సుజిత్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా. మొదట ఛార్టెడ్ అకౌంటెంట్ కావాలకున్నఅతను ఆతర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. గత పదేళ్ల కాలంలో కేవలం మూడు సినిమాలే తీసినా క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుజిత్. ఇప్పటికే శర్వానంద్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి స్టార్స్ ను డైరెక్ట్ చేసిన అతను నెక్ట్స్ న్యాచురల్ స్టార్ నానితో ఓ మూవీ తీయనున్నాడు.
ఇవి కూడా చదవండి
సుజిత్- ప్రవల్లిక పెళ్లి ఫొటోస్..
ఇక సుజిత్ భార్య పేరు ప్రవల్లిక. 2020 ఆగస్టులో వీరి వివాహం జరిగింది. పెళ్లికి ముందు వీరు చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. ఇక ప్రవల్లిక హైదరాబాద్‌లోని టాప్‌డెంటిస్టుల్లో ఒకరని సమాచారం. ఆమె ఆదాయం కూడా భారీగానే ఉందని తెలుస్తోంది. ఓజీ రిలీజ్ నేపథ్యంలో సుజిత్ సతీమణికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సుజిత్ వైఫ్ అందంలో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.