Video: మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటి సార్‌.. ఏకంగా ఉన్నతాధికారులపైనే విరుచుకుపడిన హెడ్‌మాస్టర్‌

Video: మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటి సార్‌.. ఏకంగా ఉన్నతాధికారులపైనే విరుచుకుపడిన హెడ్‌మాస్టర్‌


ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలోని మహముదాబాద్ ప్రాంతంలోని నద్వాలోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విచారణ సందర్భంగా ప్రాథమిక విద్యా అధికారి (BEO)పై దాడి చేశాడనే ఆరోపణలతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సెప్టెంబర్ 23న తన పాఠశాల సిబ్బంది ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న సమయంలో బ్రిజేంద్ర వర్మ అనే స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ తన కార్యాలయంలో తనపై దాడి చేశాడని BEO అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో హెడ్‌మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. నద్వాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో బ్రిజేంద్ర వర్మ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అదే పాఠశాలకు చెందిన అసిస్టెంట్ టీచర్‌ను వర్మ కొద్దిరోజులుగా వేధిస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో. ప్రాథమిక విద్యా అధికారి సింగ్ వర్మతో పాటు సదురు అసిస్టెంట్‌ టీచర్‌ను విచారణకు పిలిచారు. విచారణ సమయంలో ప్రధానోపాధ్యాయు వర్మకు వ్యతిరేకంగా అక్కడున్న ప్రతి ఒక్కరూ మాట్లాడారు.. అతనిదే తప్పు అని ఎత్తిచూపారు. దీంతో కోపోద్రుక్తుడైన వర్మ తన బెల్ట్ తీసి, అక్కడున్న అధికారిపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న CCTVలో రికార్డైంది.

సీసీటీవీ వీడియో ప్రకారం.. వర్మ డెస్క్‌పై ఉన్న ఫైల్‌ను తీసుకొని అక్కడున్న వారిపై దాడి చేయడం చూడవచ్చు. అడ్డుకోవడానికి వచ్చిన సిబ్బందిపై కూడా అతని దాడి చేసేందుకు ప్రయత్నించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వర్మను అరెస్ట్ చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *