
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు కాకరకాయలు చాలా మంచివి. కాకరకాయలు టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, సహజంగా రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు ఉన్నవారు లేదా హైపోగ్లైసీమియాకు గురయ్యే అవకాశం ఉన్నవారు, కాకరకాయ తినడం వల్ల వారి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు చాలా వరకు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో గ్లూకోస్ తగ్గితే తలతిరగడం లేదా మూర్ఛపోవడం, అధిక చెమట, గందరగోళం లేదా చిరాకు, హార్ట్‌బీట్‌లో మార్పులు వంటి సమస్యలు రావచ్చని చెబున్నారు.
కాకరకాయలు ఎవరు తినకూడదు
గర్భిణీ స్త్రీలు: గర్భిణీ స్త్రీలు కాకరకాయను పచ్చిగా లేదా గాఢంగా తినకూడదు ఎందుకంటే ఇందులో గర్భాశయ సంకోచాలకు కారణమయ్యే సమ్మేళనాలు ఉంటాయి. ఇది గర్భస్రావం లేదా అకాల జనన ప్రమాదాన్ని పెంచుతుంది. ఉడికించిన కాకరకాయను తక్కువ పరిమాణంలో తీసుకోవడం సురక్షితమే అయినప్పటికీ, గర్భిణీ స్త్రీలు దానిని తమ ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
కాలేయం లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్న వ్యక్తులు
కాకరకాయలోని సమ్మేళనాలు కాలేయం ద్వారా జీవక్రియ చేయబడి మూత్రపిండాల ద్వారా విసర్జించబడతాయి. ఇప్పటికే కాలేయం లేదా మూత్రపిండాల సమసయతో బాధపడేవారు దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. అలాగే మీ సమస్య మరింత పెరుగుతుంది.
మధుమేహం తగ్గించడానికి మందులు వాడేవారు
ఇన్సులిన్ లేదా నోటి ద్వారా తీసుకునే హైపోగ్లైసీమిక్ మందులు తీసుకునే వ్యక్తులు కూడా కాకరకాయలు ఎక్కువగా తీసుకోకూడదు. వీరు కాకరకాయ తీసుకోవడం వల్ల మీరు వాడే మందుల ప్రభావాలు పెరుగుతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా తగ్గుతాయి, అలాగే హైపోగ్లైసీమిక్ ఎపిసోడ్ల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మీరు కాకరకాయలు తినే ముందు వైద్యులను సంప్రదించండి
జీర్ణవ్యవస్థ సమస్యలు ఉన్నవారు
కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను చికాకు పెట్టే చేదు సమ్మేళనాలను కలిగి ఉంటుంది. కాబట్టి అల్సర్లు, యాసిడ్ రిఫ్లక్స్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు ఉన్నవారు కాకరకాయ తింటే కడుపు తిమ్మిరి, వికారం లేదా విరేచనాల వంటి అనుభవాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.