ఎక్కడికైనా వెళ్లేటప్పుడు బస్, ట్రైన్ ఆప్షన్లతో పాటు కార్ పూలింగ్ అనే మరో ఆప్షన్ కూడా ఉందని చాలామందికి తెలియదు. సొంత కార్లు ఉన్నవాళ్లు చాలాసార్లు కారులో సింగిల్‌గా ప్రయాణించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు అదే రూట్లో వెళ్లే వాళ్లతో జర్నీ షేర్ చేసుకోవడం ద్వారా కారులో బోర్ కొట్టకుండా ఉంటుంది, పెట్రోల్ ఖర్చూ కలిసొస్తుంది, ఈ కాన్సెప్ట్‌తో మొదలైందే కార్ పూలింగ్. రోజూ కారులో ఆఫీస్‌కి వెళ్లేవాళ్లు, పనుల మీద వేరే ఊరికి వెళ్తున్నవాళ్లు కార్ పూలింగ్ ఆప్షన్ ద్వారా ఇతరులను కారులో ఎక్కించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వీటిని ఎక్కువమంది వాడుతున్నారు.
యాప్స్ ఇవే..
క్వి్క్ రైడ్, పూల్ ఇట్, టోటోపూల్, రైడ్మేట్స్, యస్ రైడ్, బ్లాబ్లా కార్, జిఫీ లాంటి యాప్‌లు.. కార్ పూలింగ్ సేవలను అందిస్తున్నాయి. కారులో అదే రూట్లో ప్రయాణించే వారికోసం వెతుక్కోవాల్సిన అసరం లేకుండా ఈ యాప్స్ లేదా వెబ్‌సైట్స్ సాయపడతాయి. మీరు కారులో రోజూ తిరుగుతూఉన్నట్టయితే.. ఆ యాప్స్ లేదా వెబ్‌సైట్స్‌లో లాగిన్ అయ్యి, ప్రయాణించే రూటు, కారు నెంబర్ రిజిస్టర్ చేసుకుంటే.. సేమ్ రూట్లో ప్రయాణించే వ్యక్తులతో కనెక్ట్ అవ్వొచ్చు.
ఇద్దరికీ లాభమే
కార్ పూలింగ్తో ఎన్నో లాభాలున్నాయి. కారు ఓనర్లకు పెట్రోల్ ఖర్చులు తగ్గడం ఒక లాభమైతే.. జర్నీలు చేసేవాళ్లకు కంఫర్టబుల్ గా ఊరికెళ్లేందుకు ఒక అవకాశం దొరికినట్టవుతుంది. అప్పటి వరకు ఒకే ఏరియాలో ఒకే కాలనీలో ఉంటున్నా లేదా ఒకే కంపెనీలో పనిచేస్తున్నా ఏ మాత్రం పరిచయం లేకుండా ఎవరికి వారే రాకపోకలు సాగించేవాళ్లంతా కార్‌పూలింగ్ వల్ల ఫ్రెండ్స్ అవ్వొచ్చు. కొత్త స్నేహాలు, కొత్త పరిచయాల కోసమే చాలామంది కార్ పూలింగ్ను ఇష్టపడుతుంటారు.
సేఫ్ ఆప్షన్
మాములుగా క్యాబ్, ఆటో ద్వారా ప్రయాణించడం కన్నా ఇది ఎన్నోరెట్లు సేఫ్‌గా ఫీలవుతున్నారు. విమెన్ ఎంప్లాయిస్‌కు కూడా కార్ పూలింగ్ నమ్మకంగా తోస్తుంది. మామూలు క్యాబ్‌తో పోలిస్తే కార్ పూలింగ్ ఛార్జీ తక్కువగానే ఉంటుంది. కారు ఓనర్ డిసైడ్ చేసిన రేటుతో పాటు యాప్‌కు కొంత షేర్ ఉంటుంది. ప్రయాణాలు చేయాలనుకునేవాళ్లు ఇకపై బస్సు, ట్రైన్స్ తో పాటు పూలింగ్ ఆప్షన్స్ ను కూడా ట్రై చేయొచ్చు. కొన్ని సార్లు బస్సు కంటే తక్కువ పూలింగ్ చార్జీతోనే ఊరికి వెళ్లిపోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి