అనంతిక సనీల్ కుమార్.. తెలుగులో చాలా పాపులర్ హీరోయిన్. మొదటి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత 8 వసంతాలు మూవీతో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె.
మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతో అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇక ఇటీవల 8 వసంతాలు సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.
తాజాగా ఈ అమ్మడు బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నిర్మాతగా మారారు. ఆయన ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన కొత్త సినిమాలో 8 వసంతాలు ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ నటించనుందట.
ఈ సినిమాలో ఆమెతోపాటు యూట్యూబ్ స్టార్, మేమ్ ఫేమస్ సినిమా హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా కనిపించనున్నాడని టాక్. అనంతికతోపాటు సుమంత్ సైతం ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే.. అనంతికకు తెలుగులో మంచి అవకాశాలు క్యూ కట్టినట్లు సమాచారం. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది.