టాలీవుడ్ క్రేజీ హీరో వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఎన్ఆర్ఐ అయిన ఆమె.. మంగళవారం బీజేపీలో చేరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు సమక్షంలో రమణి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా రమణి మాట్లాడుతూ.. ‘ సమాజసేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టమన్నారు. ఎన్ఆర్ఐగా అమెరికాలో చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాను. అయితే రాజకీయాల్లో ఇలా మైక్ పట్టుకుని మాట్లాడడం ఇదే తొలిసారి. హిందూత్వమంటే నాకు చాలా ఇష్టం. మాకు ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. అందుకే బీజేపీలో చేరాను. నాకు ఈ పార్టీలో అవకాశం కల్పించినందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తాను. పార్టీ ఎన్ఆర్ఐ వింగ్‌కు నా వల్ల చేయగలిగినందతా చేస్తాను. త్వరలోనే నాలాగే మరికొంత మందిని బీజేపీలో చేరేలా కష్టించి పనిచేస్తాను’ అని రమణి చెప్పుకొచ్చారు. బీజేపీలో రమణి చేరికకు సంబంధించిన ఫొటోలను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేశారు. ‘‘ఈ రోజు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఎన్ఆర్ఐ డాక్టర్ రమణికి పార్టీ కండువా కప్పి భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానించాను. దేశభక్తి, ప్రజాసేవా తపనతో బీజేపీని ఆశ్రయించిన రమణికి హృదయపూర్వక అభినందనలు’ అని రామ్ చందర్ రావు పేర్కొన్నారు.
హ్యాపీడేస్, కొత్తబంగారులోకం సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయడు వరుణ్ సందేశ్. అయితే ఆ తర్వాత వరుణ నటించిన చిత్రాలు పెద్దగా ఆడలేదు. అయినా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ఆ మధ్యన నింద లాంటి డిఫరెంట్ మూవీతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు వరుణ్. ఇప్పుడుమరోసారి అలాంటి సినిమాతోనే మన ముందుకు వస్తున్నాడు. వరుణ్ నటించిన తాజా చిత్రం కానిస్టేబుల్. ధులిక వారణాసి హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావుతో డాక్టర్ రమణి
ఈ రోజు @BJP4Telangana రాష్ట్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ డాక్టర్ రమణి గారిని పార్టీ కండువా కప్పి భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానించాను.
దేశభక్తి, ప్రజాసేవా తపనతో బీజేపీని ఆశ్రయించిన డాక్టర్ రమణి గారికి హృదయపూర్వక అభినందనలు. pic.twitter.com/2HlXko5QrY
— N Ramchander Rao (@N_RamchanderRao) September 23, 2025
నూతన గృహ ప్రవేశం వేడుకల్లో వరుణ్ సందేశ్ ఫ్యామిలీ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి