
ఉదయం లేవగానే కాఫీ లేదా టీ కావాల్సిందే. లేకపోతే కొందరికీ ఏం తోచదు. కాఫీ తాగితే ఫుల్ రీఫ్రెష్ ఉంటుందని చాలా మంది అంటుంటారు. టీ లేదా కాఫీకి ఉపయోగించే పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే. పన్నీర్, జున్ను, వెన్న, షేక్స్, ఐస్ క్రీం వంటి వివిధ రూపాల్లో మనం పాలను నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటాం. పాలలో అనేక పోషకాలు ఉన్నప్పటికీ, రోజూ పాలు తాగడం వల్ల మన శరీరానికి ఏమి జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం.
ఎముకల ఆరోగ్యానికి పాలు
పాలు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పాలలో పుష్కలంగా ఉండే కాల్షియం, విటమిన్ డి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల ఎముకలు, కీళ్ళు బలంగా మారతాయి. వాటి మన్నిక పెరుగుతుంది.
బరువు తగ్గడంలో సహాయం
బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో పాలను చేర్చుకోవచ్చు. పాలలో స్టార్చ్, ప్రోటీన్, కొవ్వు సరైన నిష్పత్తిలో ఉంటాయి. ఇది చాలాసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. పాలలో ఉండే స్టార్చ్ శక్తిని అందిస్తే.. ప్రోటీన్ కడుపు నిండినట్లు అనిపిస్తుంది. పాలలో ఉండే బ్రాంచ్‌డ్ చైన్ అమైనో ఆమ్లాలు కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. కేసైన్, పాలవిరుగుడు ప్రోటీన్‌లు కూడా కండరాల నిర్మాణానికి దోహదం చేస్తాయి.
డయాబెటిస్, గుండె ఆరోగ్యానికి..
నిత్యం పాలు తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. తీపి పానీయాలకు బదులుగా పాలు తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. పాలలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి మంచిది. పాలు, పాల ఉత్పత్తులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల స్ట్రోక్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
క్యాన్సర్ రిస్క్..
పాలు తాగడం వల్ల కోలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే పాలలో ఉన్న కాల్షియం కీమోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే మరో అధ్యయనం ప్రకారం.. అధిక మొత్తంలో పాలు తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ కాల్షియం ఉంటుంది. రోజూ పాలు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని దీని అర్థం కాదు. పాలు, వ్యాధి మధ్య సంబంధంపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.