కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ల ధరను రూ.200కు పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఫిల్మ్ ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ పరిమితిపై స్టే విధించింది. తదుపరి విచారణ వరకు టికెట్ ధరలపై ఎటువంటి పరిమితి ఉండదని కోర్టు ఆదేశించింది. ఈ విధంగా, సిద్ధారామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా నిలిచిపోయింది.
మరిన్ని వీడియోల కోసం :