
PAK VS SL : ఆసియా కప్ సూపర్-4 దశలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య ఈరోజు ఒక కీలక మ్యాచ్ జరగనుంది. రెండు జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్‌ను గన్‌లా పట్టుకుని సెలబ్రేషన్ చేసుకున్న దానిపై మీడియా అతడిని ప్రశ్నించింది. దానికి ఫర్హాన్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.
సూపర్-4లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫర్హాన్‌కి మొదట జీరో పరుగులకే ఒక లైఫ్ వచ్చింది. ఆ తర్వాత అతడు 58 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తి కాగానే బ్యాట్‌ను తుపాకీలా పట్టుకుని కాల్చినట్లుగా యాక్షన్ చేశాడు. ఈ సెలబ్రేషన్‌పై చాలా మంది విమర్శలు చేశారు, ఇది అతడి ద్వేషపూరిత మనస్తత్వాన్ని చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. దీనిపైనే సోమవారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఫర్హాన్ స్పందించాడు.
సాహిబ్జాదా ఫర్హాన్ మాట్లాడుతూ.. మీరు ఆ సిక్సర్ల గురించి అడుగుతున్నట్లైతే… భవిష్యత్తులో మీరు ఇంకా చాలా సిక్సర్లు చూస్తారు. ఆ సెలబ్రేషన్ ఆ సమయంలో అనుకోకుండా జరిగింది. నేను సాధారణంగా హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అంతగా సెలబ్రేట్ చేసుకోను. కానీ, అప్పుడు నా మనసులో అలా చేయాలనిపించింది. అందుకే చేశాను. దాని గురించి ప్రజలు ఎలా అనుకుంటారో నాకు తెలియదు. నాకు వారి గురించి ఏ మాత్రం పట్టదని ఫర్హాన్ అన్నాడు.
“మీకు తెలుసు, ఎప్పుడైనా ఆడినప్పుడు దూకుడుగా క్రికెట్ ఆడాలి. అది భారత్‌తోనే అవసరం లేదు. ఏ జట్టుతోనైనా దూకుడుగా ఆడాలి. మేము అదే చేశాము” అని ఫర్హాన్ వివరించాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి.
పాకిస్తాన్ ఫైనల్‌కు ఎలా వెళ్తుంది?
భారత్‌తో జరిగిన మొదటి సూపర్-4 మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్తాన్‌కు ఫైనల్‌కు వెళ్లడం చాలా కష్టంగా మారింది. అయితే, ఇంకా అవకాశాలు ఉన్నాయి. రోజు శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో, తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలవాలి. అలా జరిగితే పాకిస్తాన్‌కు నాలుగు పాయింట్లు వస్తాయి. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, శ్రీలంకలను ఓడించాలి. ఇలా జరిగితే, భారత్, పాకిస్తాన్ రెండూ ఫైనల్‌కు వెళ్తాయి.
పాకిస్తాన్ vs శ్రీలంక: గెలుపెవరిది?
పాకిస్తాన్, శ్రీలంక మధ్య ఇప్పటివరకు 23 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో శ్రీలంక 10 సార్లు గెలిస్తే, పాకిస్తాన్ 13 సార్లు గెలిచింది. అయితే, గత ఐదు టీ20 మ్యాచ్‌లలో పాకిస్తాన్ ఒక్కసారి కూడా శ్రీలంకను ఓడించలేకపోయింది. ఈ విషయం పాకిస్తాన్ జట్టుకు ఒక సవాల్ లాంటిది. ఈ రోజు జరిగే మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఉండబోతుంది.