అల్ట్రావయొలెట్ అనే ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ ఎక్స్ 47 క్రాస్ ఓవర్ (Ultraviolette X-47 Crossover) అనే ఎలక్ట్రి్క్ అడ్వెంచర్ బైక్ ను లాంఛ్ చేసింది. ఇది ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతుంది. ఇది సిటీ రోడ్లలోనే కాదు, కష్టమైన ప్రదేశాల్లోనూ దుమ్ము రేపుతుంది. అంతేకాదు ఇందులో రాడార్ టెక్నాలజీ, డ్యాష్ క్యామ్ సెటప్.. ఇలా బోలెడు ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి.
రాడార్ టెక్నాలజీ
ఎక్స్ 47 బైక్.. ప్రపంచంలోనే మొదటి రాడార్ బైక్. ఇందులో హైపర్‌సెన్స్ అనే రాడార్ సిస్టమ్ ను అమర్చారు. ఇది 77 GHz రాడార్ సిగ్నలింగ్ తో పనిచేస్తుంది. అంటే సుమారు 200 మీటర్ల దూరం వరకు సరౌండింగ్స్ ను మానిటర్ చేయగలదు. రైడర్‌కు కనిపించని బ్లైండ్ స్పాట్‌లను స్కాన్ చేస్తుంది. పక్క లేన్‌లలో ఉన్న వాహనాలను గుర్తించి అలర్ట్ చేస్తుంది. లేన్ మారుతున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా హెచ్చరిస్తుంది. ఇతర వాహనాలు వెనుక నుంచి ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు రైడర్‌కు అలర్ట్ ఇస్తుంది. అలాగే వెనుక నుంచి వచ్చే వాహనం ఢీకొనే ప్రమాదం ఉంటే వెంటనే అలర్ట్ చేస్తుంది.
అదిరిపోయే ఫీచర్లు
ఈ బైక్10.3 kWh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 323 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ బైక్ 40 పీఎస్ హార్స్ పవర్, 610 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. కేవలం 2.7 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. టాప్ స్పీడ్ గంటకు 145 కిలోమీటర్లు. బ్రేకింగ్ విషయానికొస్తే.. డ్యుయల్-ఛానల్ ఏబీఎస్ సిస్టమ్ ఉంది.
ఈ బైక్ ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ ఎయిర్ కూల్డ్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో వస్తుంది. ఇది Type 6.. DC ఫాస్ట్ ఛార్జింగ్, Type 2 AC కార్ ఛార్జింగ్ .. రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. బైక్‌కు ముందు, వెనుక భాగంలో కెమెరాలు ఉంటాయి. వీటి ద్వారా రైడింగ్ వీడియోలు రికార్డ్ అవుతాయి. బైక్ లోనే 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంటుంది. బైక్ లో గ్లైడ్, కంబాట్, బాలిస్టిక్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.
ధరలు
ఈ బైక్ ధర రూ.2,49,000 నుంచి మొదలవుతుంది. అయితే ఈ ధర మొదటి వెయ్యిమంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత ధర రూ.2,74,000 ఉండొచ్చు. బుకింగ్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. బైక్ డెలివరీలు అక్టోబర్ నుంచి మొదలవుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి