ఎంతో మందికి ఇష్టమైన దుర్గా మాత శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22నప్రారంభమైన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. అయితే ఈ సంవత్సరం మాత్రం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను పది రోజులు జరుపుకోనున్నారు. ఇప్పటికే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై రెండు రోజులు పూర్తైది. అయితే ఈ క్రమంలో ఎవ్వరైనా సరే ఈ నవరాత్రి ఉత్సవాల సమయంలో కొన్ని విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలంట.
ఎందుకంటే నవరాత్రి ఉత్సవాల సమయంలో తాంత్రికశక్తులు ఎక్కువ ఉత్సాహంగా ఉంటాయంట. అందువలన ఎవరికైనా సరే దారిలో వెళ్తున్న క్రమలో ఎర్రటి వస్త్రం, నిమ్మకాయ, సూది లేదా కొబ్బరికాయ కనిపించినట్లైతే దానిని తాకడం, దాని పై నుంచి వేహికిల్ వెళ్లనివ్వడ చేయకూడదంట. దీని వలన ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. ఎందుకంటే ఈ సమయంలో తాంత్రిక శక్తులు చాలా చురుకుగా ఉంటాయంటున్నారు పండితులు.
నవరాత్రుల సమయంలో ఎట్టిపరిస్థితుల్లో ఎవ్వరైనా సరే అపరిచితుల నుంచి ఇచ్చే ప్రసాదం, స్వీట్స్, లేదా ఏవైనా బహుమతులు ఇస్తే అస్సలే తీసుకోకూడదం. దీని వలన మీరు తెలియకుండానే ప్రమాదంలో చిక్కుకుంటారు. ప్రతి కూల శక్తి వస్తుంది. ఇది మీపై ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురి చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు.
అదే విధంగా నవరాత్రి సమయంలో ఎప్పుడూ కూడా ఎవరూ స్త్రీని అగౌరవ పరచడం, అవమానించడం లాంటివి చేయకూడదని చెబుతుంటారు. ఎందుకంటే? ఈ సమయంలో అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటారు, ఏ స్త్రీని అవమానించినా ఆమె సహించదంట. ఎవరైనా స్త్రీని అవమానిస్తే వారిపై దుర్గా మాత ఆగ్రహానికి గురి కావడమే కాకుండా, తన ఆశీస్సులు కూడా అందనివ్వదంట.
అలాగే నవ రాత్రుల సమయంలో మీ బట్టలు లేదా వ్యక్తిగత వస్తువులు ఇతరులకు ఇవ్వడం చేయకూడదంట. ఇవి ప్రతికూల ఆచారాలకు ఉపయోగించే ప్రమాదం ఉన్నదంట. అదే విధంగా నవరాత్రుల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నల్లటి వస్త్రాలుధరిచకూడదని చెబుతున్నారు పండితులు.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.