కాకినాడ జిల్లా యు.కోటపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో మత్స్యకారులు తీవ్ర నిరసన తెలిపారు. కెమికల్ ఫ్యాక్టరీల కారణంగా మత్స్య సంపద తగ్గిపోతున్నదని, వారి జీవనోపాధి ప్రమాదంలో పడిందని వారు ఆరోపించారు. ఫ్యాక్టరీల వల్ల వచ్చే కాలుష్యం వలన చేపలు దొరకడం లేదని, తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని వారు తెలిపారు. ఫ్యాక్టరీలను మూసివేసి తమ జీవనోపాధికి ప్రాణం పోయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు మరియు వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఉప్పాడ బీచ్ రోడ్డు, పిఠాపురం మధ్య రాకపోకలు కొంత సమయం నిలిచిపోయాయి. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే మరింత తీవ్రమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు మత్స్యకారులు హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Burning Topic: ఆలికి సింగారమే కాదు.. అమ్మకానికీ బంగారం
తిరుమలలో రూ.102 కోట్లతో వెంకటాద్రి నిలయం నిర్మాణం
ట్రిపుల్ ప్లే సేవలను ప్రారంభించిన BSNL తెలంగాణ
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త