బంగారం లాగానే వెండికి కూడా మన ఇళ్లల్లో కొంత ప్రాధాన్యం ఉంటుంది. ఇంట్లో వస్తువుల నుంచి గిఫ్ట్ ల వరకూ చాలా వాటికి వెండిని వాడతారు. అంతేకాదు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ అప్లయెన్సెస్, వైద్య పరికరాలు వంటి వాటిలో కూడా వెండిని విరివిగా ఉపయోగిస్తారు. అయితే ధరల మార్పు విషయంలో బంగారానికి వెండికి కొన్ని తేడాలున్నాయి. అసలు వెండి ధరలు ఎలా మారతాయి? వెండిలో పెట్టుబడి పెడితే లాభం ఉంటుందా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం vs వెండి
మనదేశంలో వెండి నిల్వలు తక్కువ. మనం కొంటున్న వెండిలో చాలా భాగం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. కాబట్టి వెండి ధరలపై అంతర్జాతీయ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే డిమాండ్ , సరఫరాలను బట్టి వెండి ధరలు మారుతూ ఉంటాయి. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడినప్పుడు కూడా భారతదేశంలో వెండి ధరలు పెరుగుతాయి. వీటితోపాటు ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు వంటివి కూడా వెండి రేట్లను ప్రభావితం చేస్తాయి. అయితే బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో ఎక్కువ మార్పులు కనిపిస్తుంటాయి. రోజురోజుకీ ధరలు మారుతుండొచ్చు. ఎందుకంటే దీన్ని ఇండస్ట్రియల్ మార్కెట్ లో కూడా వాడతారు. కాబట్టి దీని ధరల్లో ఎక్కువ మార్పులు కనిపిస్తాయి.
గత పదేళ్లలో
ఇక వెండి ధరల విషయానికొస్తే.. గత పదేళ్ల నుంచి వెండి ధరల్లో భారీగా మార్పులొచ్చాయి. ధరలు తగ్గుతూమ పెరుగుతూ ఉన్నా ఓవరాల్ గా వెండి వాల్యూ మాత్రం పెరుగుతూనే వస్తుంది. ప్రస్తుతం 2025 సెప్టెంబర్ నాటికి వెండి ధర కిలో రూ.1,30,000 పలుకుతోంది. 2024లో కిలో రూ. 95,700 ఉండేది. గత పదేళ్ల లిస్ట్ ఓసారి చూస్తే..
కిలో వెండి ధర 2023లో రూ.78,600 ఉంటే..
2022 లో రూ.55,100,
2021 లో రూ. 62,572,
2020 లో రూ. 63,435,
2019 లో రూ. 40,600,
2018 లో రూ. 41,400,
2017లో రూ. 37,825,
2016 లో రూ. 36,990,
2015 లో రూ. 37,825,
2014 లో రూ. 43,070,
2013 లో రూ. 54,030 గా ఉంది
వెండిలో పెట్టుబడి పెట్టొచ్చా?
పెట్టుబడిగా పెట్టడానికి వెండి ఒక మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. బంగారంలో పెట్టుబడి పెట్టలేని వాళ్లు వెండిని సెకండ్ బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. వెండి నాణేలు చిన్న పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు వెండి కడ్డీలను కొనుగోలు చేయొచ్చు. అలాగే సిల్వర్ ఈటీఎఫ్ (ETF)లలో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. బంగారం లాగానే క్రమంగా పెరుగుదల ఉంటుంది. కాబట్టి వెండి పెట్టుబడికి ఒక మంచి ఆప్షన్ గానే చెప్తున్నారు నిపుణులు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి