Telangana: పెంపుడు కుక్కకు కోపమొచ్చి గోరుతో గిచ్చింది.. కట్ చేస్తే.. తెల్లారేసరికి

Telangana: పెంపుడు కుక్కకు కోపమొచ్చి గోరుతో గిచ్చింది.. కట్ చేస్తే.. తెల్లారేసరికి


Telangana: పెంపుడు కుక్కకు కోపమొచ్చి గోరుతో గిచ్చింది.. కట్ చేస్తే.. తెల్లారేసరికి

ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కే తమ ఇంట్లో విషాదాన్ని నింపుతుందని ఆ కుటుంబ సభ్యులు ఊహించలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో విషాదం నెలకొంది. రేబిస్ వ్యాధి సోకి సందీప్( 25) అనే యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం రెండు నెలల క్రితం సందీప్ అనే యువకుడు వీధిలో అందంగా కనిపించిన ఓ కుక్కపిల్లని పెంచుకునేందుకు ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలోనే ఆ కుక్క పిల్ల తన తండ్రిని కరవడంతో పాటు తనను కూడా గోర్లతో రక్కింది.

దీంతో తన తండ్రికి స్థానిక పిహెచ్సిలో చికిత్స చేయించుకుని.. తనను మాత్రం కరవలేదు కదా అని అజాగ్రత్త వ్యవహరించడంతో.. చికిత్స తీసుకోలేదు సందీప్. వారం రోజుల క్రితం రేబిస్ లక్షణాలు కనిపించి సందీప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతనిని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. రేబిస్ వ్యాధి సోకిందని డాక్టర్లు తెలపడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. గత వారం రోజులుగా చికిత్స పొందుతూ సందీప్ మృతి చెందాడు. కుక్క రక్కడమే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరించడమే యువకుడి ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *