మీరు ప్రతిరోజూ ఒకే సలాడ్ తిని అలసిపోయి ఉంటే, ఇది మీకోసమే.. ఎందుకంటే ఇప్పుడు మీకు రుచికరమైన, పోషకమైన కొన్ని సలాడ్ వంటకాల గురించి చెప్పబోతున్నాం. వీటిని మీరు మీరోజువారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సలాడ్లు తయారు చేయడం కూడా చాలా సులభం. కాబట్టి ఈజీగా తయారు చేసుకునే ఐదు సలాడ్ వంటకాలు, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
మెడిటరేనియన్ సలాడ్
మెడిటరేనియన్ సలాడ్..దీన్ని కూరగాయలు, చిక్పీస్లతో తయారు చేస్తారు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో లెట్యూస్ ఆకులు, దోసకాయ, టమోటా, ఉల్లిపాయ, రెడ్ బెల్ పెప్పర్ వేసి దానిని ఆలివ్ ఆయిల్ కలపండి. మరొక గిన్నెలో, వెనిగర్, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, మిరపకాయ, కొన్ని సుగంధ ద్రవ్యాలు జోడించండి. ఇప్పుడు తయారుచేసిన మిశ్రమాన్ని సలాడ్ మీద పోసి, సలాడ్ అంతా కలిపి సర్వ్ చేయండి. అంతే మీ రుచికరమైన సలాడ్ రెడీ. ఈ సలాడ్ రుచి అద్భుతంగా ఉంటుంది.
నట్టి గ్రీన్ సలాడ్
నట్టి గ్రీన్ సలాడ్ పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఈ సలాడ్ తీసుకోవడం వల్ల మీ శరీరానికి కేలరీలు, సోడియం, ఫైబర్, ప్రోటీన్ వంటి వివిధ పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఈ నట్టి గ్రీన్ సలాడ్ తయారు చేయడానికి, ఒక గిన్నెలో ఆకుకూరలు, క్యారెట్లు, పెకాన్ గింజలను తీసుకోండి. తర్వాత దానిలో నిమ్మరసం, వెనిగర్, ఉప్పు, మిరియాలు వేసి బాగా కలపండి.. తర్వాత దాన్ని ఒక కప్‌లోకి సర్వ్ చేసుకుంటే మీ నట్టి గ్రీన్ సలాడ్ రెడీ.
ఇటాలియన్ సలాడ్
ఇటాలియన్ సలాడ్ దీన్ని తయారు చేయడానికి, మీకు చెర్రీ టమోటాలు, పర్మేసన్ చీజ్, తరిగిన ఉల్లిపాయలు, లెట్యూస్, ఆలివ్‌లు, పెప్పరోని అవసరం. వీటన్నింటి ఒక బౌల్లోకి తీసుకొని.. వీటిలో ఇటాలియన్ మసాలా వేసి కలపండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా వెన్న వేసి దానిపై ఆ కూరగాయాలను వేసి తేలికగా వేయించండి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ సలాడ్ తినడం వల్ల మీ కడుపు చాలా సేపు నిండి ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి మంచి ఎంపిక
గ్రీక్ సలాడ్‌లో
గ్రీక్ సలాడ్ తయారు చేయడం చాలా సులభం. దోసకాయ, ఉల్లిపాయ చిన్నగా కట్‌చేసి వాటిలో కొంచెం ఆలివ్లను వేసి కలపండి. తర్వాత రుచికి సరిపడా మసాలా జోడించండి. తర్వాత వెనిగర్‌లో ఉప్పు, మిరియాలు, ఒరేగానో కలిపి వాటిని మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమంతో కలపండి. కావాలనుకుంటే, మీరు ఈ సలాడ్‌కు తురిమిన చీజ్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఇవన్ని చేసి తర్వాత దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మీ గ్రీక్ సలాడ్ రెడీ. ఈ సలాడ్ తినడం వల్ల మీకు ప్రోటీన్, వివిధ రకాల పోషకాలు అందుతాయి. అలాగే, మీరు ఈ సలాడ్‌ను 3 రోజుల వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచవచ్చు.
పెరుగు దోసకాయ సలాడ్
పెరుగు దోసకాయ సలాడ్ .. ఇది ముఖ్యంగా వేసవిలో తినడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సలాడ్ తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఎందుకంటే ఇందులో దోసకాయ, పెరుగు వాడతారు, ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. సలాడ్ తయారు చేయడానికి, దోసకాయను మెత్తగా కోసి పెరుగుతో కలపండి. మీకు ఇష్టమైన మసాలా దినుసులు వేసి సర్వ్ చేయండి.
Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యులను సంప్రదించండి)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.