Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్ రేసులో ఉత్కంఠ.. శ్రీలంక ఇంటికి, భారత్ గెలుపు కోసం పాకిస్థాన్ ప్రార్థనలు

Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్ రేసులో ఉత్కంఠ.. శ్రీలంక ఇంటికి, భారత్ గెలుపు కోసం పాకిస్థాన్ ప్రార్థనలు


Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోవడానికి జట్ల మధ్య పోటీ ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారింది. పాకిస్తాన్‌తో ఓటమి తర్వాత శ్రీలంక దాదాపు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు ఫైనల్‌లో భారత్‌తో తలపడేది బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ లో ఏదైనా ఒక జట్టే. ఇప్పటివరకు సూపర్-4 లో మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి, ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. నేడు భారత్ vs బంగ్లాదేశ్, రేపు పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, సెప్టెంబర్ 26న భారత్ vs శ్రీలంక మ్యాచ్‌లు ఉన్నాయి.

ఆసియా కప్ ఫైనల్ రేసు.. కంప్లీట్ ఈక్వేషన్లు

ఈక్వేషన్ 1: భారత్ గెలిస్తే..

నేడు జరిగే మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌ను ఓడిస్తే, ఫైనల్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా నిలుస్తుంది. దీంతో శ్రీలంక అధికారికంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు భారత్ vs శ్రీలంక మ్యాచ్ కేవలం నామమాత్రపు మ్యాచ్ అవుతుంది. రెండవ ఫైనలిస్ట్ ఎవరు అనేది సెప్టెంబర్ 25న జరిగే పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ మ్యాచ్‌తో తేలుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. అందుకే పాకిస్తాన్ ఫ్యాన్స్, భారత్ ఈరోజు బంగ్లాదేశ్‌ను ఓడించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్‌ను ఓడించడం ఈజీ అని వారు భావిస్తున్నారు.

ఈక్వేషన్ 2: బంగ్లాదేశ్ గెలిస్తే..

ఆసియా కప్ 2025లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడని ఏకైక జట్టు భారత్ మాత్రమే. నేడు బంగ్లాదేశ్ భారత్‌ను ఓడించడం చాలా కష్టం. కానీ ఒకవేళ బంగ్లాదేశ్ భారత్‌ను ఓడిస్తే, ఫైనల్ రేసులో దాని స్థానం మరింత సులభమవుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ను ఓడిస్తే, ఫైనల్ టికెట్ పక్కా అవుతుంది. ఒకవేళ బంగ్లాదేశ్ పాకిస్తాన్‌తో ఓడిపోయినా, అది భారత్ vs శ్రీలంక మ్యాచ్ ఫలితం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. శ్రీలంక గెలిస్తే బంగ్లాదేశ్ ఫైనల్‌కు చేరుకుంటుంది. కానీ భారత్ గెలిస్తే, నెట్ రన్ రేట్ ఆధారంగా ఫైనల్ ఆడే జట్టును నిర్ణయిస్తారు.

అన్ని జట్లు సమాన పాయింట్లతో ఉంటే..

మరొక అసాధారణ పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ భారత క్రికెట్ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోతే, టీమిండియా కేవలం 2 పాయింట్లతో ఉంటుంది. అప్పుడు బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్‌కు 4 పాయింట్లు, మరొక జట్టుకు 2 పాయింట్లు లభిస్తాయి. శ్రీలంక కూడా గెలిస్తే, దానికి కూడా 2 పాయింట్లు వస్తాయి. ఇలా మూడు జట్లు (భారత్, శ్రీలంక, పాకిస్తాన్/బంగ్లాదేశ్) 2 పాయింట్లతో ఉంటే, నెట్ రన్ రేట్ ఆధారంగా ఫైనల్‌కు వెళ్లే రెండు జట్లను నిర్ణయిస్తారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *