బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని మంగళవారం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో ఈ జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీరంగంలో ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన కత్రీనా.. చివరగా మెర్రీ క్రిస్మస్ అనే చిత్రంలో కనిపించింది. ఇక విక్కీ కౌశల్ మాత్రం ఈ ఏడాది ఛావా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. 2025లో విడుదలైన ఈ మూవీ దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ సంపాదన, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ వీరిద్దరి ఆస్తులు ఎంత ఉన్నాయో చూద్దామా.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..
నివేదికల ప్రకారం కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ఆస్తులు రూ.265 కోట్లకు పైగానే ఉంటుంది. విక్కీ కౌశల్ ఆస్తులు రూ.41 కోట్లు.. కాగా… కత్రీనా ఆస్తులు రూ.224 కోట్లు ఉంటుందని సమాచారం. బాలీవుడ్లో అత్యంత ధనవంతులైన తారలలో కత్రీనా, విక్కీ ఉన్నారు. విక్కీ కౌశల్ ప్రస్తుతం ఒక్కో సినిమా రూ.10 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఇక డంకీ చిత్రంలో అతిథి పాత్రకు రూ.12 కోట్ల వరకు తీసుకుంటున్నాడని సమాచారం. 2015లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం స్టార్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..
ఇక కత్రీనా విషయానికి వస్తే.. దశాబ్దకాలంగా సినీపరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ ఆమె. మెర్రీ క్రిస్మస్ సినిమాకు రూ.21 కోట్ల వరకు పారితోషికం తీసుకుందట. విక్కీ, కత్రీనా 2021లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో వివాహం చేసుకున్నారు. ఈ జంట వద్ద రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB (రూ. 3.28 కోట్లు), వోగ్ (రూ. 2.32 కోట్లు), మెర్సిడెస్-బెంజ్ GLE (రూ. 1.15 కోట్లు), ఆడి Q7, BMW 5GT వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఆడపులి.. యూత్‌కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..