నన్ను టచ్ చేయలేదు.. రూ. 2 కోట్లు కావాలి.. భర్తను డిమాండ్ చేసిన భార్య

నన్ను టచ్ చేయలేదు.. రూ. 2 కోట్లు కావాలి.. భర్తను డిమాండ్ చేసిన భార్య


బెంగళూరులో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లైన మూడు నెలల తర్వాత తొలి రాత్రి శారీరక సంబంధం పెట్టుకోలేదన్న కారణంతో భార్య తన భర్త నుంచి ఏకంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేసింది. దీనికి ఆమె కుటుంబ సభ్యులు కూడా తోడయ్యారు. ఈ సంఘటనపై భర్త ప్రవీణ్ కె.ఎం. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిక్‌మగళూరుకు చెందిన ప్రవీణ్.. మే 5న చందనను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట బెంగళూరులోని సప్తగిరి ప్యాలెస్‌లో నివాసం ఉంటున్నారు. పెళ్లి అయిన తర్వాత తొలి రాత్రి ప్రవీణ్ శారీరక సంబంధానికి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై చందన వైద్య పరీక్షలు చేయించుకోవాలని భర్తను కోరగా వైద్యులు ప్రవీణ్ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, మానసిక ఒత్తిడి కారణంగా సమయం తీసుకోవాలని సలహా ఇచ్చారు.

రూ. 2 కోట్ల డిమాండ్.. దాడి

మూడు నెలల తర్వాత చందన తన భర్తపై ఒత్తిడి పెంచి, పరిహారంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రవీణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆస్తి వివాదం నేపథ్యంలో ఆగస్టు 17న చందన కుటుంబ సభ్యులు ప్రవీణ్ నివాసంలోకి బలవంతంగా చొరబడి అతనితో పాటు బంధువులపై దాడి చేశారు. ఈ ఘటన తర్వాత ప్రవీణ్ గోవిందరాజ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దల పంచాయతీ.. దాడి

ప్రవీణ్ ఫిర్యాదు ప్రకారం.. పెళ్లి తర్వాత లైంగిక సంబంధం పెట్టుకోలేదన్న కారణంతో చందన గొడవలకు దిగింది. కుటుంబాన్ని అవమానిస్తూ పరువు తీసే వ్యాఖ్యలు చేసింది. చందన బంధువులు కూడా పలుమార్లు ఇంట్లోకి చొరబడి బెదిరింపులకు పాల్పడ్డారని ప్రవీణ్ తెలిపారు. జూన్ 5న దాదాపు 15 నుండి 20 మంది బంధువులు ఇంట్లో పంచాయితీ నిర్వహించి, చందనకు రూ. 2 కోట్ల విలువైన ఆస్తిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారని తెలిపారు.

ఆగస్టు 17న చందన, ఆమె బంధువులు తనపై హింసాత్మకంగా దాడి చేశారని.. ఆస్తిని ధ్వంసం చేసి, ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారని ప్రవీణ్ ఆరోపించారు. దీనికి సాక్ష్యంగా సీసీటీవీ ఫుటేజ్, వైద్య నివేదికలను సమర్పించినట్లు ఆయన తెలిపారు. చందనతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ తన ఫిర్యాదులో కోరారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *