Horoscope Today: ఈ రాశివారికి డబ్బులు వచ్చినా జేబుకు చిల్లే.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

Horoscope Today: ఈ రాశివారికి డబ్బులు వచ్చినా జేబుకు చిల్లే.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే


Horoscope Today: ఈ రాశివారికి డబ్బులు వచ్చినా జేబుకు చిల్లే.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం తప్పకుండా వృద్ధి చెందుతుంది. ఉద్యోగం జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది.  జీత భత్యాలకు, పదోన్నతికి సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తవు తాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. లాభసాటి పరిచయాలు ఏర్పడ తాయి. ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండి, రుణ సమస్యల్ని, ఆర్థిక సమస్యల్ని తగ్గించు కోగ లుగుతారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూల వుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపా రాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

దాదాపు ప్రతి ప్రయత్నమూ లాభసాటిగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి.  చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి సహకారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుం టాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగు తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. ప్రతి వ్యవ హారం సఫలం అవుతుంది. కొన్నివ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. కష్టార్జితంలో కొంత భాగం వృథా అవుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

కన్య (ఉత్తర 1,2,3, హస్త, చిత్త 1,2)

ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ముఖ్య మైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలున్నా సానుకూల తలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమా చారం అందుతుంది. కుటుంబంలో కొద్దిగా ఒత్తిడిఉండే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇంట్లో శుభ కార్యా లకు ప్లాన్ చేస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభానికి అవ కాశం ఉంది.  ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందవచ్చు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయానికి లోటుండదు. చిన్నా చితకా ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమైపోతాయి. ప్రయత్నం చేస్తున్న పెళ్లి సంబంధం కుదురుతుంది. కెరీర్ పరంగా తప్పకుండా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందే అవకాశం ఉంది. మాట తొందరతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయంతో పాటు ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగు తుంది. అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహా రాలు, ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి చేసే ప్రయ త్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. పిల్లల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణాలు లాభి స్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదనపు బాధ్యత లను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు కలుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సానుకూల స్పందనలు లభించ వచ్చు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. కొందరు బంధువుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కూడా లాభ సాటిగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఏ ప్రయత్నమైనా నిదానంగా సాగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. సొంత పనుల్ని పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. రావలసిన డబ్బును రాబట్టు కుంటారు. వ్యయ ప్రయాసలతో గానీ ఏ పనీ పూర్తి కాదు. ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగి పోతాయి కానీ, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో అంచ నాల్ని అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *