తాజాగా సోషల్ మీడియాలో సుమ కనకాల చిన్ననాటి ఫోటో వైరల్‌గా మారింది. రెండు జడలు, పెద్ద కళ్ళద్దాలు ధరించి చిరునవ్వుతో ఉన్న ఆ చిన్నారిని చూడగానే ఎవరైనా సుమ అని గుర్తుపడతారు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరలో టాప్ యాంకర్‌గా, టివి షోల హోస్ట్‌గా, ప్రీ-రిలీజ్ ఫంక్షన్లలో ప్రధాన వ్యాఖ్యాతగా సుమ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగు మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ, తనదైన ప్రతిభతో నంబర్ వన్ గా దూసుకుపోతోంది. కేరళకు చెందిన ఆమె అచ్చమైన తెలుగు అమ్మాయిలా మాట్లాడటం విశేషం. నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తెలుగు బుల్లితెరలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. జయమ్మ పంచాయితీ సినిమాతో మరోసారి వెండితెరపై కనిపించింది. సుమ ప్రస్తుతం తన కెరీర్లో మంచి జోష్‌తో దూసుకుపోతోంది. ఆమె డేట్స్ దొరకక ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు వాయిదా వేసిన స్టార్స్ కూడా ఉన్నారు. ఇంతటి పేరు, ప్రఖ్యాతి దక్కించుకున్న సుమ ఇప్పుడు ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు.