నేచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏ అమ్మడి సొంతం. తెలుగులో ఈ బ్యూటీని తెలుగులో లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తుంటారు. ప్రేమమ్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. దీంతో తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలను మించి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది
ఇటీవలే తండేల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తుండగా.. రాముడిగా రణభీర్ కపూర్ కనిపించనుంది. ఇదిలా ఉంటే సాయి పల్లవి ఎలాంటి స్కిన్ షో చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ మంచి ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి
ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు
ఇదిలా ఉంటే తాజాగా సాయిపల్లవికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎలాంటి గ్లామరస్ రోల్స్ చేయని సాయి పల్లవి సోషల్ మీడియాలోనూ బ్యూటీ ఫుల్ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సాయి పల్లవి బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో సాయి పల్లవి గ్లామరస్ గా కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎప్పుడు నిండుగా కనిపించే సాయి పల్లవి ఇప్పుడు బికినిలో కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. మరి ఈ ఫోటోలు నిజమేనా.? లేక ఏఐ మాయ అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు సాయి పల్లవి పై కొందరు సీరియస్ అవుతున్నారు. సాయి పల్లవి రామాయణం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బికినిలో ఫోటోలకు ఫోజులిచ్చిన సాయి పల్లవిని రామాయణం నుంచి తొలగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాయ్ కాట్ సాయి పల్లవి అనే ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. దీని పై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి