మేషం: శివపార్వతుల అనుగ్రహంతో ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాల్లో అలవికాని భారాన్ని, బాద్యతలను మోస్తుంటారు. సహజసిద్ధమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉండే ఈ రాశివారంటే దేవతకు ఎంతో ఇష్టం. దసరా తర్వాత ఈ రాశివారికి విజయాలు, సాఫల్యాలు వృద్ది చెందుతాయి. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం కావడంతో పాటు ఆదాయ మార్గాలు విస్తరించడం కూడా జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు చేపడతారు. ఊహించని రీతిలో విదేశీ అవకాశాలు లభిస్తాయి.
వృషభం: శివపార్వతుల కరుణా కటాక్షాల వల్ల ఈ రాశివారికి ఈ ఏడాది అత్యంత వైభవంగా సాగిపోతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
కర్కాటకం: అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రాశికి దసరా తర్వాత జీవితం సుఖ సంతోషాలతో సాగిపోయే అవకాశం ఉంది. ఎంత కష్టమైన పనైనా సునాయాసంగా పూర్తవుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ఉద్యో గులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. తప్పకుండా హోదాలు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆస్తి, భూలాభాలు కలుగుతాయి.
ధనుస్సు: దసరా తర్వాత నుంచి ఈ రాశివారికి దశ తిరుగుతుంది. ఈ ఏడాదంతా బాగా అనుకూలంగా గడిచిపోయే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. అధికారులకు వీరి సమర్థత మీద నమ్మకం బాగా పెరుగుతుంది. తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది.
మకరం: ఈ రాశివారి మీద ఈ ఏడాదంతా అమ్మవారి కరుణా కటాక్షాలు పూర్తి స్థాయిలో ప్రసరించే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది.
కుంభం: ఈ రాశికి దసరా తర్వాత అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ ఏడాదంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఏలిన్నాటి శని ప్రభావం కూడా తగ్గిపోతుంది. ఆదాయానికి లోటుండదు. ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అలవికాని లక్ష్యాలను సైతం సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.