12 సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. పెళ్ళైన 16 రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరంటే

12 సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. పెళ్ళైన 16 రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరంటే


టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో కంటే వివాదాలతో, వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. కొంతమంది ప్రేమ, పెళ్లి, విడాకుల వార్తల్లో ఎక్కువగా పాపులార్ అవుతున్నారు. కాగా వరుస సినిమాతో హీరోయిన్స్ గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అలంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆమె హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్ళైన 16రోజులకే విడాకులు తీసుకుంది. అప్పట్లో ఆమె పెళ్లి , విడాకులు పెద్ద సంచలనం. ఈ ముద్దుగుమ్మ తెలుగులో 12 సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు మాత్రం దక్కలేదు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది

పై ఫొటోలో కనిపిస్తున్న భామ ఎవరో కాదు.. ఎస్త‌ర్ నోరోన్హా.. టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భామల్లో ఈ అమ్మడు ఒకరు. వెయ్యి అబద్దాలు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది బబ్లీ బ్యూటీ ఎస్త‌ర్ నోరోన్హా. ఎస్త‌ర్ నోరోన్హా ఏకంగా తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సునీల్ తో ఈ అమ్మడు భీమవరం బుల్లోడు అనే సినిమా చేసింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది.

ఇవి కూడా చదవండి

ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు

ఆతర్వాత జయ జానకి నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ సినిమాలో నటించి మెప్పించింది. 69 సంస్కార్‌ కాలనీ అనే సినిమాలో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు..2019 జనవరిలో గాయకుడు, రాపర్ నోయెల్ సీన్‌ను వివాహం చేసుకుంది. కానీ ఈ ఇద్దరూ కేవలం 16రోజులకే విడిపోయారు. మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. ఈ చిన్నదానికి తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆమె బోల్డ్ రోల్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవల తల అనే సినిమాలో కనిపించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎస్తర్ మాట్లాడుతూ.. నాకు ఒంటరిగా ఉండాలని లేదు. నాకు వివాహం చేసుకోవాలని ఉంది. నాకు ఓ అందమైన జీవితం కావాలి అని చెప్పుకొచ్చింది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నదిని కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *