వంద రోజుల్లో మేడారం రూపురేఖలు మారనున్నాయి. వన దేవతల కోసం నవ లోకం నిర్మాణానికి అడుగులు పడ్డాయి. సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్‌నిర్మాణానికి మాస్టర్ ప్లాన్‌ని రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాష్ట్ర మంత్రులతో కలిసి మేడారంలో తల్లులను దర్శించుకున్న రేవంత్‌రెడ్డి.. సమ్మక్క, సారలమ్మల గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. 40 ఏళ్ల తర్వాత మేడారం ప్రాంగణ ఆధునీకరణకు అడుగులు పడ్డాయి. రెండేళ్ల ఒక్కసారి జరిగే మహా జాతరతో పాటు.. ఏడాది పొడుగునా మేడారంలో వనదేవతలైన సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకునేందుకు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి, మంగళవారం (సెప్టెంబర్ 23) మధ్యాహ్నం 12:40 గంట లకు గిరిజన పూజారులు గిరిజన సాంప్రదాయ ప్రకారం అభివృద్ధి పనులపై గద్దెల ప్రాంగణంలో ప్రారంభించారు. సమ్మక్క, సారలమ్మల గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ యానిమేషన్‌ను సీఎం రేవంత్ రిలీజ్ చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..