Car safety rating: ఈ కార్లు ఎక్కితే ఇక భయం ఉండదు! ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న బలమైన కార్లు ఇవే!

Car safety rating: ఈ కార్లు ఎక్కితే ఇక భయం ఉండదు!  ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న బలమైన కార్లు ఇవే!


ఈ రోజుల్లో కారు కొనేముందు ధర, మైలేజ్‌ మాత్రమే కాదు సేఫ్టీ రేటింగ్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి. హైస్పీడ్ రోడ్లు, పెరిగిన ట్రాఫిక్‌ కారణంగా కారు సేఫ్టీకి కూడా కొంత ప్రాధాన్యం ఇవ్వాలి. కారు సేఫ్టీ అంటే అందులో ఉన్న వాళ్ల సేఫ్టీ కూడా. ఈ సేఫ్టీ అనేది  గ్లోబల్ ఎన్ సీఏపీ (NCAP) వంటి సంస్థలు వాహనాలను క్రాష్ చేసి, పరీక్షించి 1 నుంచి 5 స్టార్ల వరకూ రేటింగ్ ఇస్తుంటాయి. ఈ రేటింగ్‌ ఆధారంగా కారు ఎంత సేఫ్ అనేది తెలిసిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ సేఫ్ కార్లు ఏవంటే..

టాటా హ్యారియర్, సఫారీ

టాటా హ్యారియర్, సఫారీ కార్లు్ ప్రస్తుతం ఇండియాలోనే సేఫెస్ట్ కార్లు. 60 కి.మీ స్పీడ్‌తో కారు ఏ యాంగిల్‌లో డ్యాష్ ఇచ్చినా లోపల ఉన్నవాళ్లు దాదాపు సేఫ్‌గా ఉంటారు. గ్లోబల్ సేఫ్టీ రేటింగ్స్‌లో 5 స్టార్స్ పొందిన ఈ కార్లు 2.0 లీటర్ ఇంజిన్‌తో వస్తాయి. ధరలు రూ. 15 లక్షల నుంచి మొదలవుతాయి.

టాటా పంచ్/ టాటా నెక్సాన్

టాటా పంచ్, టాటా నెక్సాన్ ఈ రెండు కార్లు 1.2 లీటర్ ఇంజిన్ తో వస్తాయి. ఈ రెండు కార్లకు 5 స్టార్ గ్లోబర్ రేటింగ్ ఉంది. పంచ్ కారు ధర రూ. 7 లక్షలు, నెక్సాన్ ధర రూ.8 లక్షల నుంచి మొదలవుతుంది. మార్కెట్లో బడ్జెట్ లో దొరికే  సేఫెస్ట్ కార్స్ అంటే ఈ రెండింటినే ముందు చెప్పుకోవాలి.

మహింద్రా  ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 700

గ్లోబల్ సేఫ్టీ రేటింగ్స్‌లో మహింద్రా ఎక్స్‌యూవీ 300 , ఎక్స్‌యూవీ 700 కార్లు 5 స్టార్స్ సాధించాయి. 1.2 లీటర్ ఇంజిన్ కలిగిన ఎక్స్‌యూవీ 300 ధర రూ. 8.4 లక్షల నుంచి మొదలవుతుంది. 2.0 లీటర్ ఇంజిన్ కలిగిన ఎక్స్‌యూవీ 700 ధర రూ. 13 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ రెండు కార్లు అత్యంత దృఢమైన బిల్డ్ ని కలిగి ఉంటాయి. కంఫర్ట్ తో పాటు సేఫ్టీ ఉండాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్స్.

హ్యుందాయ్ వెర్నా

సెడాన్ మోడల్స్ లో 1.4 లీటర్ ఇంజిన్ కలిగిన హ్యుందాయ్ వెర్నా కారు.. 5 స్టార్ గ్లోబల్ సేఫ్టీ రేటింగ్ కలిగి ఉంది. దీని ధర రూ. 11 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కారు 140 కి.మీ. టాప్ స్పీడ్ తో వెళ్లగలదు.

ఫోక్స్‌వాగన్ టైగున్

ప్రీమియం ఎస్‌యువీ అయిన ఫోక్స్‌వాగన్ టైగున్ 1.4 లీటర్ ఇంజిన్ తో వస్తుంది. ఈ కారు గ్లోబల్ ఎన్ సీఏపీ క్రాష్ టెస్ట్ లో  5 స్టార్ల సేఫ్టీ రేటింగ్ పొందింది. దీని ధర రూ. 12లక్షల నుంచి మొదలవుతుంది.

 స్కోడా కుషక్

స్కోడా ప్రీమియం ఎస్ యూవీ అయిన  స్కోడా కుషక్.. 1.5 లీటర్ ఇంజిన్ తో వస్తుంది. ఈ కారు గ్లోబల్ సేఫ్టీ రేటింగ్స్‌లో 5 స్టార్స్ పొందింది. దీని ధర రూ. 12 లక్షల నుంచి మొదలవుతుంది.

మహింద్రా స్కార్పియో

ఇండియాలోని సేఫెస్ట్ కార్స్‌లో మహింద్రా స్కార్పియో కూడా ఒకటి. 2.0 లీటర్ ఇంజిన్ ఉన్న ఈ కారు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ధర రూ. 12 లక్షల నుంచి మొదలవుతుంది. ఇకపోతే మహింద్రా థార్ కారు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ మాత్రమే ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *