ఇన్‌స్టాగ్రామ్‌లో చిగురించిన ప్రేమ చివరకు విషాదంగా ముగిసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. కాన్పూర్‌కు చెందిన సూరజ్ కుమార్ ఉత్తమ్, ఆకాంక్ష కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఆకాంక్ష వేరే వ్యక్తితో మాట్లాడుతోందని సూరజ్ అనుమానం పెంచుకున్న సూరజ్ ఆకాంక్షను నిలదీశాడు. ఈ విషయమై జులై 21న ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంతో రగిలిపోయిన సూరజ్, ఆమె తలను గోడకేసి కొట్టాడు. అనంతరం గొంతు నులిమి చంపేశాడు. డెడ్‌బాడీని మాయం చేసి నేరాన్ని కప్పిపుచ్చుకోవాలనుకున్న సూరజ్ తన మిత్రుడి సహాయం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆకాంక్ష మృతదేహాన్ని ఓ పెద్ద బ్యాగ్‌లో కుక్కి, యమునా నదిలో ఆ బ్యాగును పడేయాలని వారి ప్లాన్. ఈ క్రమంలో బైక్‌పై 100 కిలోమీటర్ల దూరంలోని బాందాకు బయలుదేరారు. మార్గమధ్యంలో సూరజ్ ఆ బ్యాగ్‌తో ఒక సెల్ఫీ కూడా తీసుకుని తన పైశాచికత్వాన్ని చాటుకున్నాడు. కొన్ని రోజులుగా తన కుమార్తె నుంచి ఫోనుగాని, ఆమె సమాచారం ఏమీ తెలియకపోవడంతో ఆగస్టు 8న ఆకాంక్ష కనిపించడం లేదంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురిని సూరజ్ కిడ్నాప్ చేశాడని ఆమె ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సూరజ్‌ను, అతని స్నేహితుడిని సెప్టెంబరు 18న అదుపులోకి తీసుకున్నారు. మొదట తనకేమీ తెలియదని బుకాయించిన సూరజ్ ఫోన్ సంభాషణల ఆధారాలు చూపడంతో నేరాన్ని అంగీకరించాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తమకు పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని సూరజ్ పోలీసులకు తెలిపాడు. తొలుత తన సోదరితో కలిసి బర్రా ప్రాంతంలో నివసించిన ఆకాంక్ష, తర్వాత సూరజ్‌తో కలిసి హనుమంత్ విహార్‌లో అద్దె ఇంట్లో ఉండటం ప్రారంభించింది. తాను తీసుకున్న సెల్ఫీ గురించి కూడా సూరజ్ పోలీసులకు చెప్పడంతో, అతని ఫోన్ నుంచి ఆ ఫోటోను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫస్ట్ టైం విమానం ఎక్కాడు.. అనుకోకుండా బుక్కయ్యాడు
వచ్చే ఏడాది ఇంటర్ లో జాయిన్ అయ్యేవారికి గోల్డెన్ ఛాన్స్
ఓజీ క్రేజ్.. జనసేన ఖజానాకు విరాళాలు
దేశమంతా 9 రోజులు.. అక్కడ మాత్రం ఒక్కరోజే దసరా
కొబ్బరిబోండాల లారీ బోల్తా.. సంచులతో ఎగబడిన జనం