Tooth Decay: తీవ్రమైన పంటి నొప్పితో బాధపడుతున్నారా?.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పండి!

Tooth Decay: తీవ్రమైన పంటి నొప్పితో బాధపడుతున్నారా?.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పండి!


ప్రస్తుత ఫాస్ట్‌ లైఫ్, మారుతున్న ఆహారపుల అలవాట్ల కారణంగా చాలా మంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. హై షుగర్ ఫుడ్స్, జిగట ఆహారాలు, కూల్ డ్రింక్స్‌, సరిగ్గా బ్రష్‌ చేయకపోవడం ద్వారా దంత కుహరాలు లేదా దంత క్షయం సమస్య పెరుగుతోంది. దంత కుహరాలను సాధారణంగా దంతాలలో రంధ్రాలు అని పిలుస్తారు. ఈ రంధ్రాలు క్రమంగా లోతుగా వెళ్లి దంతాల మూలాలను చేరుతాయి, ఇది దంతాలలో ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే, దంతాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. అయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలేంటి, వాటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఉప్పు,ఆవాల నూనె పేస్ట్: వైద్య నిపుణులు ప్రకారం.. ఉప్పు, ఆవాల నూనె మిశ్రమం పంటి నొప్పి లేదా తేలికపాటి దంత క్షయాన్ని తగ్గిస్తుంది. రెండు చుక్కల ఆవాల నూనెను చిటికెడు ఉప్పుతో కలిపి ఆ పేస్ట్‌తో మీ దంతాలు,చిగుళ్ళపై సున్నితంగా బ్రష్‌ చేయండి. ఇలా చేయడం ద్వారా చిగుళ్లు, దంతాలపై ఉన్న బ్యాక్టీరియా నశించి వాటిని బలపరుస్తుంది.

లవంగాల నూనె: మీ పంటి ఆరోగ్యానికి లవంగం నూనే కూడా మంచి ఎంపిక, ఈ నూనెలో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం సహజ క్రిమినాశనిగా పనిచేస్తుంది. ఒక వేళ కుహరం వల్ల మీకు పంటినొట్టి కలిగిలే..లవంగం నూనెను పత్తికి రాసి నొప్పి ఉన్న దగ్గర అంటించుకోండి. దీని వల్ల మీకు ఉపశమనం లభించడంతో పాటు ఆ నూనే నరాలకు చేరి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

వేప కర్రలు: మన పెద్దల కాలం నుంచి చాలా మంది ఎక్కవగా వేప పుల్లతో పళ్లు శుభ్రం చేసుకోవడం మనకు తెలిసిందే. వేప పుల్లతో పళ్లు శుభ్రం చేసుకోవడం ద్వారా దంతాల నుండి ఫలకం తొలగిపోవడమే కాకుండా నోటిలోని క్రిములు కూడా చనిపోతాయి. ప్రతి రోజూ ఉదయం వేప కర్రలతో పళ్ళు తోముకోవడం వల్ల దంతక్షయం, దంత క్షయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

పసుపు, కొబ్బరి నూనె: పసుపు ఒక సహజ యాంటీబయాటిక్, కొబ్బరి నూనె యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి పేస్ట్ లా చేసి మీ దంతాలకు సున్నితంగా రుద్దుకోండి. ఇలా చేయడం ద్వారా మీ దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కావిటీస్‌ వంటి సమస్యలు రాకుండా చూస్తాయి.

గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి: భోజనం చేసిన వెంటనే గోరువెచ్చని నీటితో పళ్ళు తోముకోండి. ఇలా చేయడం ద్వారా కావిటీస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. అంతేకాకుండా బ్యాక్టీరియా ఏర్పడే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. ఒక వ్యక్తి ఈ అలవాటును పెంచుకుంటే, వారి దంతాలు చాలా కాలం పాటు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటాయని వైద్యులు అంటున్నారు.

గమనిక: మీ పంటి నొప్పి ప్రారంభ దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ చిట్కాలు ఉపయోగకరంగా ఉంటాయి. కానీ మీ పంటి నొప్పి తీవ్రంగా ఉన్నా లేదా చీము ఏర్పడుతుంటే, వీటి వల్ల ప్రయోజనం ఉండదు. అలాంటి సందర్భాలలో, మీరు కచ్చితంగా దంతవైద్యుడిని సంప్రదించాలి.( పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *