అయితే, విచారణలో అసలు విషయం తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐఎక్స్-1086 విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి విమాన ప్రయాణం ఇదే మొదటిసారి. ప్రయాణ సమయంలో అతను పొరపాటున టాయిలెట్ కోసం వెతుకుతూ కాక్‌పిట్ డోర్ వద్దకు చేరుకున్నాడు. దానిని టాయిలెట్ డోర్ అనుకొని తీయబోయాడు.దీనిని గమనించిన సిబ్బంది అటు వెళ్లకూడదంటూ సున్నితంగా అతడికి సూచించారు. దీంతో అతను తిరిగివచ్చి తన సీటులో కూర్చున్నాడు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. తాము ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని, ఈ ఘటనలో ఎలాంటి భద్రతాపరమైన ముప్పు వాటిల్లలేదని పేర్కొంది. విమానం వారణాసిలో ల్యాండ్ అయిన వెంటనే, ఆ ప్రయాణికుడిని నిబంధనల ప్రకారం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులకు అప్పగించామని, ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు. మరోవైపు, ఆ ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ పాస్‌కోడ్‌ను ఎంటర్ చేశాడని, బహుశా ఇది విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం కావొచ్చనే ఉద్దేశంతో సిబ్బంది అడ్డుకున్నారని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వచ్చే ఏడాది ఇంటర్ లో జాయిన్ అయ్యేవారికి గోల్డెన్ ఛాన్స్
ఓజీ క్రేజ్.. జనసేన ఖజానాకు విరాళాలు
దేశమంతా 9 రోజులు.. అక్కడ మాత్రం ఒక్కరోజే దసరా
కొబ్బరిబోండాల లారీ బోల్తా.. సంచులతో ఎగబడిన జనం
దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.o.. ఏ వస్తువుల ధరలు ఎంతెంత అంటే..