సినీ నటుడు ధర్మమహేశ్ పై ఆయన భార్య చేసిన ఆరోపణలు మరోసారి వైరల్ గా మారాయి. తన భర్త మంచి వాడు కాదు అని.. హీరోయిన్స్ తో ఎఫైర్స్ పెట్టుకున్నాడని.. తనను పెళ్లి చేసుకున్న తర్వాత నరకం చూపించాడని ధర్మమహేశ్ భార్య గౌతమి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పాటు పలు ఇంటర్వ్యూల్లోనూ.. సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా మరోసారి ఆమె మీడియా ముందుకు వచ్చి భర్త ధర్మమహేశ్తోపాటు పలువురు సినీ సెలబ్రెటీల పై కూడా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఇంఫులెన్సర్, బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ రీతూ చౌదరి పై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త రీతూ చౌదరితో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆమె ఆరోపించింది. అంతే కాదు కొన్ని వీడియోలను కూడా షేర్ చేసింది.
చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది
రీతూ చౌదరితో ధర్మమహేశ్ ఎఫైర్ పెట్టుకున్నాడని.. తాను ప్రగ్నెంట్ గా ఉన్న సమయంలో రీతూ చౌదరితో కలిసి ఉన్నాడని గౌతమి చెప్పుకొచ్చింది. గతంలో తాను, ధర్మమహేశ్ కలిసున్నా అపార్ట్మెంట్కు రీతూ చౌదరి వస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాత్రిసమయంలో అందరూ నిద్రపోయిన తర్వాత ఆమె తన భర్త దగ్గరకు వస్తుందని ఆరోపించింది గౌతమి. రాత్రి 1గంటకు వచ్చి తెల్లవారుజామున 4 గంటల సమయంలో వెళ్ళిపోతుందని.. గౌతమి ఆరోపించింది.
ఇవి కూడా చదవండి
ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు
అలాగే బిగ్ బాస్ ఫేమ్ కిరాక్ సీత పై కూడా ఆమె ఆరోపణలు చేసింది. తన రెస్టారెంట్ 16 బ్రాండ్ ను ప్రారంభించడానికి ఓ క్రికెటర్ ను ఆహ్వానించాలని ప్లాన్ చేసుకున్నా ఆ సమయంలో కిరాక్ సీత తనకు ఇన్ స్టా గ్రామ్ లో మెసేజ్ చేసిందని.. ఎలా నువ్వు రెస్టారెంట్ ఓపెన్ చేస్తావో నేనూ చూస్తా.. నాకు పెద్ద పెద్ద క్రికెటర్స్ తెలుసు.. నేను ఇన్వైట్ చేస్తా అని మెసేజులు చేసింది. అసలు నా రెస్టారెంట్ గురించి ఆమెకెందుకు.? అసలు ఆ విషయాల్లో ఆమె ప్రమేయం ఏంటి.? ఆమె వెనుక నా భర్త ఉన్నాడని అర్థం అయింది. నువ్వు రెస్టారెంట్ ఎలా ఓపెన్ చేస్తావో చూస్తా అని సీత బెదిరించింది. ఇన్ స్టార్ గ్రామ్ లో నాకు మెసేజ్ లు చేసింది. మా ఇంటికి కూడా వచ్చింది. నా భర్తకు సీతకు మధ్య ఎలాంటి సంబంధం ఉందో నాకు తెలియదు అని గౌతమి చెప్పుకొచ్చింది.
ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.