Tea and Coffee: ఉపవాస సమయంలో కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉంటారు. సాయంత్రం పూజ అనంతరం మాత్రమే ఆహారం తీసుకుంటారు. అలాగే, కొందరు టీ, కాఫీలు వంటివి తీసుకుంటారు. కానీ, కొందరు మాత్రం టీ,కాఫీలు తాగాలా వద్దా అని సందేహంలో పడుతుంటారు. అయితే, మీరు కూడా ఉపవాసం చేస్తూ ఏం తినాలి..? ఏం తినకూడదు అని ఆలోచిస్తున్నారా? మీ సందేహాలకు ఇక్కడ సమాధానం తెలుసుకుందాం..
టీ, కాఫీ తాగడం వల్ల ఉపవాసం ముగుస్తుందా?:
టీ, కాఫీ తాగడం వల్ల ఉపవాసం ముగుస్తుందా?:
నవరాత్రి ఉపవాస సమయంలో ఆహారం గురించి ప్రజల్లో వివిధ నమ్మకాలు ఉంటాయి. కొందరు పండ్లు, పాలు, తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. మరికొందరు టీ, కాఫీ కూడా తీసుకుంటూ ఉంటారు. నిజానికి, ఉపవాస సమయంలో టీ తాగడానికి ఎలాంటి నిషేధం లేదని చెబుతారు. అలాగే, మరికొందరు ఉపవాస సమయంలో కాఫీ తాగకూడదని కొందరు, టీ తాగితే కాఫీ కూడా తాగొచ్చని ఇంకొందరు చెబుతుంటారు. మొత్తమ్మీద ఉపవాస సమయంలో టీ, కాఫీ తాగడానికి ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పవచ్చు. మీరు త్రాగాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.
ఆరోగ్య దృక్కోణం నుండి సరైనదా..? లేదంటే తప్పా..? :
ఉపవాస సమయంలో టీ, కాఫీ అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ఉపవాస సమయంలో కడుపు ఎక్కువగా ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో కెఫిన్ కలిగిన పానీయాలు తీసుకోవడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట, ఆమ్లత్వం వంటి సమస్యలు వస్తాయి. కాఫీ ముఖ్యంగా అధిక ఆమ్లత్వం కలిగి ఉంటుంది. కాబట్టి ఖాళీ కడుపుతో తాగడం వల్ల సమస్యలు పెరుగుతాయి. అదేవిధంగా టీలో చక్కెర, పాలు ఎక్కువగా ఉంటే, అది జీర్ణక్రియలో ఇబ్బందిని కలిగిస్తుంది. అందువల్ల, మీరు టీ, కాఫీ తాగే అలవాటు కలిగి ఉంటే, ఒకటి కంటే ఎక్కువ తీసుకోకుండా ఉండాలి. అలాగే, చక్కెర తక్కువగా ఉండేలా చూసుకోండి.
శక్తి పెంచే పానీయాలు:
ఉపవాసం సమయంలో శక్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి చాలా మంది టీ, కాఫీని సులభమైన ఎంపికలుగా భావిస్తారు. కానీ, వీటికి ప్రత్యామ్నాయంగా ఇతర ఆరోగ్యకరమైనవి కూడా ఉన్నాయి. కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు, పాలు లేదా పండ్ల రసం ఉపవాసం సమయంలో ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటాయి. అవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. తక్షణ శక్తిని అందిస్తాయి. అవి ఆమ్లత్వం లేదా గుండెల్లో మంటను కూడా నివారిస్తాయి.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.