దీంతో, విమానం 3 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఢిల్లీ నుంచి ఇండిగో విమానం మధ్యాహ్నం 2:10 గంటలకు కాన్పూర్ విమానాశ్రయానికి చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం 2:55 గంటలకు కాన్పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. టేకాఫ్‌కు ముందు.. సిబ్బంది, కొంతమంది ప్రయాణికులు ఎలుక తిరుగుతున్నట్లు గమనించారు. అంతే విమానంలోని ప్రయాణికులతో పాటు సిబ్బంది సైతం నానా హైరానా పడిపోయారు. ఆ ఎలుక. విమానంలోని వైర్లను ఒక వేళ కొరికితే.. తమ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడం ఖాయమంటూ వారంతా ఆందోళన వ్యక్తం చేయటంతో, విమానంలోని సిబ్బంది, ఎయిర్ హోస్టెస్‌లు ప్రయాణికులకు నచ్చజెప్పి.. అందరినీ శాంతింపజేశారు. భద్రతకు ప్రాధాన్యతనిస్తూ.. విమానంలో ఉన్న మొత్తం 140 మంది ప్రయాణికులను బయటకు విమానాశ్రయ లాంజ్‌కు పంపించారు. ఆ తర్వాత విమానయాన సంస్థ సాంకేతిక సిబ్బంది, గ్రౌండ్ సిబ్బంది విమానం అంతా మూడు గంటల పాటు వెతికి.. చివరకు ఎలుకను పట్టుకున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తమ ప్రయాణం 3 గంటలు ఆలస్యమైందని.. కొందరు ప్రయాణీకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూర్యుడిని రెండుగా చీలుస్తూ నింగికి ఎగిసిన ఫాల్కన్.. అదిరిపోయే ఫొటోను చూసారా