
చాలా మంది చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పలు రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. కానీ చర్మానికి నిజమైన మెరుపును పునరుద్ధరించే మాయాజాలం ప్రకృతిలోనే దాగి ఉంది. క్యారెట్ అటువంటి కూరగాయల్లో తొలి వరుసలో ఉంటుంది. ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. నిజానికి, క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని వృద్ధాప్య సంకేతాలు, ముడతల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. క్యారెట్లు సన్‌బర్న్ లేదా టాన్‌ను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. క్యారెట్లు చర్మపు రంగును పునరుద్దరిస్తాయి. ప్రకాశవంతమైన ప్రభావాన్ని తెస్తాయి. క్యారెట్లు మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. పొడి చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడతాయి.
క్యారెట్లను ఎలా ఉపయోగించాలంటే?
క్యారెట్ ఫేస్ ప్యాక్: ఉడికించిన క్యారెట్లను మెత్తగా పేస్ట్ చేసుకుని, అందులో తేనె, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.
క్యారెట్ జ్యూస్ టోనర్
క్యారెట్ రసాన్ని వడకట్టి, స్ప్రే బాటిల్లో నింపి ఫ్రిజ్‌లో ఉంచాలి. ప్రతిరోజూ ముఖం కడుక్కున్న తర్వాత దీన్ని టోనర్‌గా ఉపయోగించవచ్చు.
యాంటీ ఏజింగ్ మాస్క్
క్యారెట్ రసం, గుడ్డు పచ్చసొన, ఆలివ్ నూనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మంపై ముడతలు, పొడిబారడం తగ్గించడానికి సహాయపడుతుంది.
క్యారెట్, శనగపిండి ఫేస్ ప్యాక్
శనగపిండిని క్యారెట్ రసంతో కలిపి పేస్ట్ లా చేసి ముఖంపై అప్లై చేయాలి. ఇది ట్యాన్‌ను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.
క్యారెట్లు ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు. సహజ సౌందర్య సంరక్షణ ఉత్పత్తిగా కూడా పనిచేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా, సరైన పద్ధతిలో ఉపయోగిస్తే వైద్యులతో పనిలేకుండానే ఆరోగ్యంగా ఉండటానికి వీలుంటుంది. అయితే క్యారెట్లు తినడం, చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మ సహజ ప్రకాశాన్ని పునరుద్ధరించవచ్చు. నిత్య యవ్వనంగా ఉండవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.