చర్మ సంరక్షణలో మగువలు ఎన్నో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వంటివి ప్రతి రోజూ తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. ఒకటి చర్మం మొత్తం తేమను నిర్వహించి, పొడిబారడాన్ని తగ్గిస్తుంది. లోపలి నుండి ప్రకాశవంతంగా చేస్తుంది. మరొకటి చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుంచి వెలువడే UV కిరణాల నుంచి రక్షిస్తుంది. కానీ చాలా మందికి ఈ రెండింటిలో ఏది మొదట బాడీకి అప్లై చేయాలి? సన్‌స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్? ఏది సరైనది? అనే సందేహం ఉంటుంది. ఈ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
చర్మ సంరక్షణకు ముందుగా మాయిశ్చరైజర్ రాసి, చివరగా సన్‌స్క్రీన్ రాసుకోవాలని నిపుణులు అంటున్నారు. చర్మ సంరక్షణ ప్రారంభించేటప్పుడు చాలా మందికి ఈ విషయంలో అయోమయం ఉంటుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ముందుగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. సన్‌స్క్రీన్ దినచర్యలో చివరి దశలోనే వాడాలి. మాయిశ్చరైజర్ నిజానికి లోపలి నుంచి చర్మానికి రక్షణ అందిస్తంఉది. ఇది ముందుగా లోపలికి వెళ్లి చర్మాన్ని పోషిస్తుంది. సన్‌స్క్రీన్ పై పొరకు మాత్రమే రక్షణగా ఉంటుంది. అందుకే ముందుగా మాయిశ్చరైజర్ శరీరానికి అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అయితే సన్‌స్క్రీన్ సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మంపై రక్షణ పొరను సృష్టిస్తుంది.
అయితే మీరు ముందు సన్‌స్క్రీన్ అప్లై చేస్తే, మాయిశ్చరైజర్ చర్మంలోకి సరిగ్గా చొచ్చుకుపోదు. అది సన్‌స్క్రీన్ రక్షణను కూడా బలహీనపరుస్తుంది. బదులుగా ముందు మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. ఇది చర్మంలోకి ఇంకిపోయే వరకు నిమిషం పాటు వేచి ఉండాలి. ఆ తర్వాత పైన స్పెక్ట్రం సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలి. ముఖం మాత్రమే కాదు మెడ, ఇతర బయటకు కనిపించే భాగాలకు ప్రతి 3-4 గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్‌ను మళ్లీ మళ్లీ అప్లై చేయాలిడి. ఇలా చేస్తే మీ చర్మాన్ని ఆరోగ్యంగా దీర్ఘకాలం రక్షించడంలో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.