నేటి కాలంలో గుండె జబ్బులు విపరీతంగా పెరిగాయి. గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్, గుండెపోటు వంటి అనేక వ్యాధుల వల్ల వయసుతో సంబంధం లేకుండా జనాలు చనిపోతున్నారు. రక్త ప్రసరణకు, గుండె సంబంధిత వ్యాధులకు చాలా దగ్గరి సంబంధం ఉంది. అందువల్ల మీ ఆరోగ్యంలో ఈ కింది కొన్ని రకాల లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మీ రెండు చేతుల్లో ఒకటి నిరంతరం నొప్పిగా ఉంటే, అది రక్త నాళాలలో అడ్డంకికి సంకేతం. ఈ చేతి నొప్పి కొన్నిసార్లు భరించలేనిదిగా ఉంటుంది. మీ ఒంట్లో కూడా ఈ లక్షణాలలో దేనినైనా అనుభవిస్తే ఆలస్యం చేయకుండా మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
శరీరంలో రక్త ప్రసరణ సజావుగా లేకపోతే చర్మం రంగు మారుతుంది. ముఖ్యంగా వేళ్ల చర్మం రంగు మారుతుంది. వేళ్లు నీలం, ఊదా రంగులో కనిపించడం ప్రారంభిస్తాయి.
చలి, ఒత్తిడి వల్ల కూడా వేళ్ల చర్మం రంగు మారవచ్చు. అయితే ఈ లక్షణం మళ్లీ మళ్లీ కనిపిస్తే, గుండె ధమనుల వ్యాధికి సంకేతం కావచ్చు. కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
శరీరంలో పై భాగంలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే, కండరాలు క్రమంగా బలహీనపడతాయి. బరువు మోయగల శక్తి తగ్గుతుంది. చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు కూడా చేతులు అలసిపోతాయి. అలాంటి లక్షణాలు కూడా రక్త ప్రసరణ సరిగా లేకపోవడానికి సంకేతాలు. ఇలంటి సందర్భంలో కూడా నిర్లక్ష్యం తగదు.