CM Revanth: సమ్మక్క – సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్.. నిలువెత్తు బంగారం సమర్పణ..

CM Revanth: సమ్మక్క – సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్.. నిలువెత్తు బంగారం సమర్పణ..


మేడారం సమ్మక్క సారక్క దేవతల గద్దెల ప్రాంగణం పునర్నిర్మానానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ ఏర్పాట్లలో స్పీడ్ పెంచారు.. సీఎం స్వయంగా వన దేవతలను దర్శించుకుని ఆధునికరణ పనులను పరిశీలించారు. సమ్మక్క సారక్క దేవతలకు ప్రీతికరమైన నిలువెత్తు బంగారాన్ని(బెల్లం ) తులాభారం ద్వారా సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి 68 కిలోలు తూగారు. మేడారం మాస్టర్ ప్లాన్ పరిశీలనలో భాగంగా ప్రత్యేక హెలికాప్ట‌ర్‌లో మేడారంకు చేరుకున్న సీఎంకు మంత్రి సీతక్క, మేడారం పూజారులు, ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాలు, డోలి వాయిద్యాలతో స్వాగతం పలికారు. ప్రధానద్వారం లోపలికి వచ్చిన ముఖ్యమంత్రి తులాభారం సమర్పించారు. అయితే 2024 మహా జాతర సమయంలో సమ్మక్క సారక్క దేవతల దర్శనానికి వచ్చిన సీఎం నిలువెత్తు బంగారం సమర్పించారు.. అప్పుడు కూడా 68 కిలోలే తూగారు..రెండేళ్లు కావస్తున్న CM బరువు మాత్రం తగ్గలేదు.. పెరగలేదు.. కాగా జాతర ఏర్పాట్లతో పాటు మేడారం అభివృద్ధిపై రేవంత్ సమీక్ష నిర్వహిస్తారు. ఈ సారి జాతరకు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *