
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లి గురించే ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు నేత్రదానం చేయడానికి ముదుకు వచ్చారు. చిన్నాపెద్ద తేడా లేకుండా నేత్రల ఇస్తామని సంకల్ప పత్రం ఇచ్చారు. ఈ గ్రామంలో, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్పు మొదలైంది. మొదట ఒక్కరిద్దరు నేత్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే వాళ్లు చనిపోయిన తరువాత నేత్రలను సేకరించారు. తరువాత మేము కూడా ఎందుకు ఇవ్వకూడదని ఆలోచించారు. దీంతో కొంతమంది ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే నేత్ర దానం కోసం గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై గ్రామ సభలో చర్చించారు. దీంతో ప్రతి ఒక్కరు నేత్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అందరూ సంకల్ప పత్రంలో సంతకం పెట్టారు. దీంతో ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు సంతకం పెట్టారు. నేత్రాల దానం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ ఐదేళ్లలో 30కి పైగా చనిపోయారు.
వారందరూ నేత్రదానం చేశారు. వృద్ధులు కూడా సంతోషంగా సంకల్ప పత్రపై సంతకం పెట్టారు. వీరి నేత్రాలు తీశారు. అయితే కళ్లలో పెద్దగా తేడా లేదు. దీంతో చనిపోయిన వెంటనే ప్రతినిధులకు సమాచారం ఇస్తున్నారు. వెంటనే వచ్చి నేత్రాలను సేకరిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు నేత్రాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామంపై పాజిటివ్ చర్చ సాగుతుంది. ఇప్పటికే చాలామందికి అవగాహన ఉండటం లేదు. ఎవరైనా చనిపోతే బాడిలో ఏ పార్ట్‌ని ఇవ్వడానికి ముందుకు రారు కానీ ఈ గ్రామస్తులు సంతోషంగా ఒప్పుకుంటున్నారు. తాము చనిపోయినా మరి కొంతమంది జీవితాల్లో వెలుగులు ప్రసాదించడం సంతోషంగా ఉందని అంటున్నారు. అయితే ఈ స్వచ్చంద సంస్థ ప్రతినిధులు కూడా సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు
నేత్ర దానంతో పాటు అవయవ దానం గురించి వివరిస్తున్నారు. దీంతో చాలామందికి అవగాహన చేస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామంలో నేత్రదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నారు. అంతేకాదు తమ బంధువులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. మొత్తానికి వంద శాతం నేత్రాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్న గ్రామం ఇది ఒక్కటే అని చెప్పవచ్చు. మీరు కూడా నేత్రాలు ఇచ్చి మరి కొంతమంది జీవితాల్లో వెలుగులు ప్రసాదించాలని కోరుతున్నారు. ఈ పల్లె ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. తాము నేత్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు నేత్రాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. తమ నాన్న చనిపోతే నేత్రాలు ఇచ్చామని వారి కొడుకులు చెబుతున్నారు. తమ నాన్న లేకపోయినా ఇంకో వ్యక్తికి చూసే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు నేత్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుపుతున్నారు.