Car Fuel tips: కారులో పెట్రోల్/డీజిల్ ఎలా కొట్టించాలి! చాలామందికి తెలియని విషయాలు!

Car Fuel tips: కారులో పెట్రోల్/డీజిల్ ఎలా కొట్టించాలి! చాలామందికి తెలియని విషయాలు!


Car Fuel tips: కారులో పెట్రోల్/డీజిల్ ఎలా కొట్టించాలి! చాలామందికి తెలియని విషయాలు!

కారుని మంచిగా మెయింటెయిన్ చేయాలనుకునేవాళ్లు కారులో పెట్రోల్/డీజిల్ ఎలా నింపాలి? ఎంత నింపాలి అనే విషయాలు తెలుసుకోవాలి. వీటి గురించి చాలామందికి అవగాహన ఉండదు. అందుకే వాటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫుల్ ట్యాంక్

కారు విషయంలో చాలామంది చేసే తప్పు ఫ్యుయెల్ ట్యాంక్‌ను ఫుల్ చేయడం. ఇలా చేయడం వల్ల చాలా నష్టాలున్నాయి. ఫ్యుయెల్ ట్యాంక్ ఫుల్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంధనం ఫ్లో సరిగా ఉండదు. ట్యాంక్ లో కొద్దిగా కూడా గాలి లేకపోతే.. ఇంజిన్ కు ఫ్యుయెల్ సప్లై స్లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ట్యాంక్ నిండుగా కొట్టించడం అంత మంచిది కాదు.

కారు రోడ్డుపై వెళుతున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు, గుంతల వంటి ప్రదేశాల్లో కారు కదులుతుంది. ఇలా కదిలినప్పుడు కారు ట్యాంక్ లో ఉండే ఫ్యుయెల్ కూడా కదులుతుంది. ఒకవేళ అది కదలడానికి ట్యాంక్ లో ప్లేస్ లేకపోతే.. ఇంధనం బయటకు చిమ్మే అవకాశం ఉంది. లేదా ఫ్యుయెల్ ప్రెజర్ లో మార్పులొచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఇంధనం వృథా అవ్వడమే కాకుండా ఇంజిన్ పెర్ఫామెన్స్ తగ్గే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఎయిర్ కూడా పట్టేయొచ్చు.

ఎంత పెట్రోల్ నింపాలి?

ప్రతి కారుకి ఫ్యుయెల్ ట్యాంక్ కెపాసిటీ వేర్వేరుగా ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి ఒక లీటరు తక్కువగా ఫిల్ చేయాలి అంటే.. మీ కారు ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్లు అయితే 19 లీటర్లకు సుమారుగా కొట్టిస్తే సరిపోతుంది. లేదా మీరు మరొక మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నింపుతున్నప్పుడు మొదటి ఆటో-కట్ రాగానే ఇంక ఆపమని  చెప్పాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి నష్టం  ఉండదు.

ఎంప్టీ ట్యాంక్

ఇకపోతే ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల కలిగే నష్టం కంటే ఎంప్టీ ట్యాంక్ వల్ల కలిగే నష్టం ఇంకా ఎక్కువ. అంటే ప్రతిసారి కారులో చాలా కొద్దిమొత్తంలో ఫ్యుయెల్ కొట్టిస్తూ ఉండడం వల్ల ప్రెజర్ లో మార్పులొచ్చి.. ఇంజన్ స్టార్ట్ అవ్వకుండా మొరాయించే అవకాశం ఉంది. కాబట్టి కారులో ఎప్పుడు ఫ్యుయెల్ కొట్టించినా.. ట్యాంక్ కెపాసిటీలో కనీసం నాలుగో వంతు కొట్టించాలి.

ఇవి కూడా..

కారులో ఫ్యుయెల్ కొట్టించేటప్పుడు కారు ఇంజిన్ ఆపేసి కొట్టించాలి. అలాగే ఫ్యుయెల్ పంప్ తో కొట్టేటప్పుడు పంప్ గొట్టం ట్యాంక్ లోపలికి పూర్తిగా వెళ్లిందో లేదో చూడాలి. లేకపోతే ఫ్యుయెల్ కొట్టేటప్పుడు కొంత లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ లైట్ గా లీక్ అయితే వెంటనే క్లాత్ తో తుడిచేయాలి.

కారులో లాంగ్ జర్నీ వెళ్లేటప్పుడు అవసరం అవుతుందని చాలామంది పెట్రోల్/డీజిల్ ను క్యాన్స్ లో క్యారీ చేస్తుంటారు. ఇది కొన్ని సార్లు ప్రమాదానికి దారి తీయొచ్చు. కాబట్టి వీలైనంత వరకూ అలా చేయకపోవడమే మంచిది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *