టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చలామణి అవుతున్న ఎన్టీఆర్ 2011లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు. ఈ శుభ కార్యం జరిగిన కొన్ని రోజులకే అదే ఏడాదిలో అల్లు అర్జున్ స్నేహ రెడ్డితో కలిసి ఏడడుగులు నడిచాడు. ఆ మరుసటి ఏడాది రామ్ చరణ్ ఉపాసనతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. అయితే ఈ ముగ్గురు హీరోలు కూడా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కడానికి కారణం ఒక స్టార్ హీరోయిన్. అవును ఆమెనే ఈ విషయాన్ని బయట పెట్టింది. ఈ ముగ్గురు హీరోలంతా పెళ్లి చేసుకోవడానికి నేనే కారణమంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా
ఇవి కూడా చదవండి
గతంలో తమన్నా ఏ హీరోతో నటిస్తే ఆ హీరోకి పెళ్లి జరుగుతుందనే ఒక సెంటిమెంటు బలంగా తెరపైకి వచ్చింది. ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తో మాట్లాడుతూ తమన్నానే ఈ విషయాన్ని బయట పెట్టింది. ‘చరణ్ నువ్వు ఒకటి ఇక్కడ గమనించావా..? నేను ఎవరితో నటిస్తుంటే ఆ హీరోలంతా కూడా పెళ్లి చేసుకుంటున్నారు’ అని చెప్పింది .దానికి రామ్ చరణ్ కూడా రియాక్ట్ అవుతూ.. ‘ అవును, రచ్చ సినిమా షూటింగ్ అప్పుడు నువ్వు నాకు ఇదే చెప్పావు. అయితే అప్పుడు నేను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ జరుగుతున్న సంఘటనలు బట్టి చూస్తే నాకు ఆశ్చర్యం అయింది. రచ్చ షూటింగ్ పూర్తయ్యే లోపే అమ్మానాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేయడం, ఉపాసనతో నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి అని కూడా చకచకా జరిగిపోయాయి అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.
తమన్నా లేటెస్ట్ ఫొటోస్..
రామ్ చరణ్, తమన్నా జంటగా రచ్చ సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదల కాకముందే రామ్ చరణ్ ఉపాసనను వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి చిత్రంలో తమన్నా కథానాయికగా నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ కూడా పెళ్లి చేసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా బద్రీనాథ్ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నప్పుడే మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టాడు. మొత్తానికి ఈ ముగ్గురు హీరోలు తమన్నాతో సినిమాలు చేస్తున్నప్పుడే పెళ్లిపీటలెక్కడమనేది యాదృచ్ఛికంగా జరిగినా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. వీరే కాదు తమన్నా కార్తితో ఆవార చిత్రంలో నటించినది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక కార్తీ కూడా పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రభాస్, రామ్ విషయంలో మాత్రం ఇది జరగలేదు. ఇప్పటికీ వారు బ్యాచిలర్స్ గానే మిగిలిపోయారు. మరోవైపు తమన్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.