Telangana: షాప్‌కు కస్టమర్లు ఎవ్వరూ రాలేదు.. కట్ చేస్తే.. ఈ వ్యాపారి చేసిన పని చూస్తే స్టన్

Telangana: షాప్‌కు కస్టమర్లు ఎవ్వరూ రాలేదు.. కట్ చేస్తే.. ఈ వ్యాపారి చేసిన పని చూస్తే స్టన్


Telangana: షాప్‌కు కస్టమర్లు ఎవ్వరూ రాలేదు.. కట్ చేస్తే.. ఈ వ్యాపారి చేసిన పని చూస్తే స్టన్

వ్యాపార విస్తరణ, సేల్స్ పెంచుకునేందుకు వ్యాపారులు నానా తంటాలు పడుతుంటారు. అడ్వర్టైజ్ మెంట్స్‌తో పాటు డిస్కౌంట్లు, ఆఫర్లు, వన్ ప్లైస్ వన్ అంటూ ఊదర గొడుతుంటారు. ఎలాగైనా వినియోగదారుడు తమ వ్యాపార కేంద్రాలకు వచ్చేలా ఐడియాలు వేస్తుంటారు. గిరాకీ పెంచుకోవదానికి ఓ వ్యాపారి చిత్రమైన ఉపాయంతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు. ఆ వ్యాపారి టాలెంట్‌కు వాహ్ అంటున్నారు. ఆ వ్యాపారి టాలెంట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణం ప్రధాన వాణిజ్య కేంద్రంగా కొనసాగుతోంది. పట్టణంలో అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి. అయితే వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు రకరకాల పద్ధతులను వినియోగిస్తున్నారు. పట్టణంలో వివేకానంద సెంటర్ నుంచి పీఎస్ఆర్ సెంటర్ వెళ్లే దారిలో రూపచారి అనే వ్యాపారి సీసీ కెమెరాల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో సీసీ కెమెరాలు వినియోగం ఎక్కువగా పెరిగింది. దీంతో తన వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు రూపచారి వినూత్న ఆలోచన చేశాడు. తన దుకాణం అందరి దృష్టినీ ఆకర్షించేందుకు సూపర్ ఐడియాను అమలు చేశాడు.

తన షాప్‌లో పాడైపోయిన సీసీ కెమెరాలతో వినూత్న ప్రయోగం చేశాడు. తన షాపు ఎదుట ఒక స్తంభాన్ని ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఆ పోల్‌కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40సీసీ కెమెరాలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశాడు. దీంతో ఆ సెంటర్ గుండా వెళ్లే ప్రతి ఒక్కరిని సీసీ కెమెరాల స్తంభం ఆకర్షిస్తోంది. సాధారణంగా తమ వ్యాపారానికి సంబంధించి సింబాలిక్‌గా షాపు ముందు ఏదైతే పాత వస్తువులను ఏర్పాటు చేస్తుంటారు. తన దుకాణంలో పాడైపోయిన సీసీ కెమెరాలతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఈ ప్రయత్నం చేశానని షాప్ యజమాని రూపచారి చెబుతున్నారు. వ్యాపార అభివృద్ధి ఏమో కాని.. ఆలోచన మాత్రం భిన్నంగా ఉందనీ స్థానికులు చర్చించుకుంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *